జగన్ ముఖ్యమంత్రి కావాలని గుండెలు బాదుకున్న ఒక ప్రధాన సామాజిక వర్గం ఇపుడు బావురుమంటోంది. అయితే అది బయటకు చెప్పుకోలేక లోపల మింగలేక నానా విధాలుగా నరకం అనుభవిస్తోంది. కేసులో ఓడిన వాడు కోర్టు బయట ఏడుస్తాడు, ఓడిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు అని ఒక సామెత ఉంది. సరిగ్గా రెడ్లకు ఇది సరిపోతుంది అంటున్నారు. మా జగన్ అంటూ ఒకనాడు మీసాలు మెలేసిన వారికి అదే జగన్ చుక్కలు చూపిస్తున్నారు అంటున్నారు. జగన్ ఓట్ల కోసం సామాజిక సమీకరణలు పేరిట తనదైన కసరత్తు చేసుకుంటున్నారు. రెడ్లను పూర్తిగా అలా గాలికి వదిలేశారు అన్న విమర్శలు అయితే వైసీపీలో ఉన్నారు.
జగన్ కోసం పదేళ్ళ పాటు పోరాడిన వారున్నారు. ఆస్తులు అమ్ముకున్న వారు ఉన్నారు. జగన్ సీఎం అయితే తమకూ మంచి రోజులు వస్తాయని ఒళ్ళు గుళ్ళ చేసుకున్న వారు ఉన్నారు. ఇపుడు వీరంతా జై జగన్ అని గట్టిగా అనలేని పరిస్థితి. ఎందువల్ల అంటే ప్రతీ పదవీ జగన్ కులం చూసే ఇస్తున్నారు. బీసీల జపం చేస్తున్నారు. జనరల్ కేటగిరీ సీట్లలో కూడా ఇతర సామాజిక వర్గాలకు పదవులు పంచుతున్నారు. దీని వల్ల అన్ని అర్హతలు ఉండి ఎంతో ఆశ పెట్టుకున్న పదవులు కళ్ళ ముందే దక్కకుండా పోతున్నాయి.చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద నాయకుడు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మంత్రి కావాల్సి ఉంది. కానీ జగన్ ఆ పదవి ఇవ్వలేదు. పోనీ తన కుమారుడిని మేయర్ చేస్తారు అనుకున్నారు. పోటీ చేయిస్తే అదీ దక్కలేదు. దాంతో ఆయన బాగా వాపోతున్నారని అంటున్నారు. ఇదే పరిస్థితి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలలో ఉంది. జగన్ ఇష్టారాజ్యం గా పాలన చేస్తున్నారు అని వారు గుర్రుమంటున్నారు.
రెండేళ్ల కాలం ఇట్టే గడచాయి. మరో మూడేళ్ళు ఇంతే. మాకు పదవులు రావు అని వారు చెప్పేస్తున్నారు అంటే జగన్ వైఖరిని బాగా చదివేశారు అనుకోవాలి. ఏది ఏమైనా జగన్ కోసం అష్టకష్టాలు పడిన రెడ్లు ఇపుడు తీవ్ర మనో వేదనలో ఉన్నారు. మరి వారిని జగన్ కనుక పట్టించుకోకపోతే 2024 లో జరిగే ఎన్నికల్లో పొలిటికల్ గా భారీ తేడాలు వచ్చేస్తాయి అంటున్నారు.
Discussion about this post