వచ్చే ఎన్నికల్లో పోటీకి అపుడే తెలుగుదేశం పార్టీ తయారవుతోంది. అయితే ఆ పార్టీ ఈసారి గెలిచేందుకు అనేక రకాలైన ఎత్తులు ఎజిత్తులు కూడా వేస్తోంది. ఈసారి కచ్చితంగా జనసేన జట్టు వీడకూడదని కూడా తీర్మానించేసుకుంది. ఏపీలో 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేస్తే ఆరుశాతం ఓట్లు వచ్చాయి. అదే విధంగా తెలుగుదేశానికి 38 శాతం ఓట్లు వచ్చాయి. మరో వైపు వైసీపీకి 51 శాతం ఓట్లు లభించాయి. ఇక యాంటీ ఇంకెంబెన్సీ ద్వారా వైసీపీ ఓట్ల శాతం వచ్చే ఎన్నికల్లో భారీగా తగ్గుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో జనసేన టీడీపీ కలిస్తే కచ్చితంగా 45 శాతానికి పైగా ఓట్లు వస్తాయి. అధికారం కూడా ఖాయమనే ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉంటే విశాఖ సిటీలో చాలా సీట్లు ఈసారి పొత్తులో భాగంగా జనసేన కోరుతుందని టాక్ కూడా మొదలైంది. ఆ సీట్లలో గాజువాక కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన విశాఖ జిల్లా నుంచి పోటీ చేయకపోవచ్చు అంటున్నారు. అయినా సరే గాజువాక నుంచి 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి అని ఆ పార్టీ భావిస్తోందిట. ఇక గతంలో గాజువాక నుంచి పోటీ చేద్దామని ఆశపడిన జనసేన సీనియర్ నేత కోన తాతారావును విశాఖ తూర్పునకు పంపించారు.ఆయన టీడీపీ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ చాలా కాలం పాటు పనిచేశారు. ఉక్కు కార్మిక సంఘం నాయకుడిగా కూడా గతంలో పనిచేశారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయనకు గాజువాకలో బలం ఉంది. దాంతో ఆయన తనకు సీటు ఖాయమని భావిస్తున్నారు. ఇక గాజువాకలో కూడా ఆయన సామాజికవర్గం హెచ్చు సంఖ్యలో ఉండడం ఉపయోగపడుతుంది అంటున్నారు.

అందువల్ల టీడీపీతో పొత్తు ఉంటే కనుక కచ్చితంగా జనసేన ఈ సీటు వదులుకోదు అంటున్నారు. ఈసారి టీడీపీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి గెలుపు ఖాయమని కూడా గాజుగ్లాస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తు ఖాయమైతే వైసీపీలో ఉన్న నేతలు కూడా పలువురు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.
Discussion about this post