రాజకీయాల్లో నాయకులు నాలుక ఊరికే మడతపెట్టేస్తారు. ఒకసారి చెప్పిన మాట. మరోసారి చెప్పరు. ఒకసారి ఉన్న పార్టీ కడువా, మరో సారి ఉండదు. అలాగే అప్పటివరకు ఒక పార్టీలో ఉండి వెంటనే ప్లేట్ ఫిరాయించి, ముందు పని చేసిన పార్టీనే తిడతారు. ఇలా ప్లేట్ ఫిరాయించిన నాయకులు మాట్లాడే మాటలకు పెద్దగా విలువ ఉందనే చెప్పొచ్చు. ఈ విషయం జూపూడి ప్రభాకర్‌కు బాగా వర్తిస్తుందనే చెప్పొచ్చు.

మొదట కాంగ్రెస్‌లో పనిచేసిన జూపూడి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. అలాగే జగన్‌కు ఒక కుడి భుజం మాదిరిగా పనిచేశారు. ఇక వైసీపీలో ఉండగా జూపూడి, టిడిపి అధినేత చంద్రబాబుపై ఏ విధంగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే అలా జగన్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న జూపూడి, 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ చేశారు. టిడిపిలోకి వచ్చాక జూపూడి ఏ విధంగా జగన్‌పై విమర్శలు చేశారో కూడా తెలిసిందే. అలాగే చంద్రబాబుకు బాగా భజన చేశారు.

టిడిపిలో ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులని సైతం అనుభవించారు. ఇక 2019 ఎన్నికల్లో టిడిపి అధికారం కోల్పోయాక జూపూడి మనసు మళ్ళీ మారింది. నిదానంగా జగన్‌కు దగ్గరైపోయారు. మళ్ళీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. అయితే వైసీపీలో చేరిన వెంటనే టిడిపి మీద విమర్శలు చేస్తే బాగోదని అనుకున్నారు అనుకుంటా..కొన్ని రోజులు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు.

కానీ ఇటీవల జగన్, జూపూడికి నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీంతో మళ్ళీ మీడియా ముందుకు జూపూడి వచ్చారు. చంద్రబాబుని విమర్శించడం, జగన్‌కు భజన చేయడం మొదలుపెట్టారు. దళితులకు చంద్రబాబు హయాంలో ఏం న్యాయం జరిగిందని ప్రశ్నించిన జూపూడి, సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత జగన్‌ది అన్నారు. మరి టిడిపి హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిందే జూపూడి.

ఇక బాబు హయాంలో దళితులకు న్యాయం జరిగిందో లేదో జూపూడికే తెలియాలని టిడిపి శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. ఏదేమైనా రాజకీయాల్లో ఇలా నాలుగు మడత వేసే నాయకుల మాటలకు విశ్వసనీయత ఉండదని, ఇలాంటి వారిని పార్టీ అధినేతలు ఎంకరేజ్ చేయకూడదని అంటున్నారు.

Discussion about this post