ఏపీ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకి కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు జేసీ ఫ్యామిలీ ఏపీలో రాజకీయాలు చేసింది. కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన జేసీ ఫ్యామిలీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి వచ్చింది. 2014లో ఆ ఫ్యామిలీ ఎన్నికల్లో బాగానే సత్తా చాటింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జేసీ ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ కంచుకోట తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఓడిపోగా, అనంతపురం పార్లమెంట్‌లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి ఓడిపోయారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. కానీ జేసీ ఫ్యామిలీ మాత్రం రాజకీయంగా దూకుడుగా ఉంటూనే ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై కేసులు పెట్టి, జైల్లో పెట్టిన కూడా వెనక్కి తగ్గలేదు. జైలు నుంచి వచ్చాక వారు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు.తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ ఓడిపోయినా, తాడిపత్రిలో మాత్రం గెలిచింది. దానికి కారణం జేసీ ఫ్యామిలీనే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్ కూడా అయ్యారు. అక్కడ నుంచి దూకుడుగా జేసీ ఫ్యామిలీ పనిచేస్తుంది. అటు అనంతపురం పార్లమెంట్ పరిధిలో కూడా పవన్ బాగానే పనిచేస్తున్నారు. అక్కడ కూడా టీడీపీ బలోపేతం అయినట్లే కనిపిస్తోంది.
అయితే కేసులకు భయపడకుండా పార్టీ కోసం కష్టపడితే బాగుంటుందని, అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావచ్చని, లేదంటే 2019 ఎన్నికల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని జేసీ ఫ్యామిలీ చెబుతుంది. కాబట్టి రాష్ట్రంలో మిగతా నాయకులు సైతం జేసీ ఫ్యామిలీలాగానే పోరాడితే టీడీపీకి బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు.
Discussion about this post