గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో కీలక నాయకుడుగా ఉన్న బుచ్చయ్య చౌదరీ…ఇటీవల అలకపాన్పు ఎక్కారు. తన మాటకు పార్టీలో పెద్ద గౌరవం ఉండటం లేదని, రాజమండ్రిలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు పట్టించుకోవడం లేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తానని బుచ్చయ్య మాట్లాడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం సైతం బుచ్చయ్యని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి బుచ్చయ్య లైన్ అయినట్లే కనిపిస్తోంది.

అయితే బుచ్చయ్య మాదిరిగానే తూర్పులో ఉన్న మరో సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ సైతం అసంతృప్తితో ఉన్నారని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆయన గుండెనొప్పితో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే జ్యోతులని మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. దీంతో జ్యోతుల ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లిపోతుందని ప్రచారం వస్తుంది.

త్వరలోనే జ్యోతుల, తన తనయుడు నవీన్‌ని తీసుకుని వైసీపీలో చేరనున్నారని కథనాలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి చూసుకుంటే అలాంటి పరిస్తితి లేదనే చెప్పొచ్చు. జ్యోతుల ఫ్యామిలీకి టీడీపీ అధిష్టానం బాగానే ప్రాధాన్యత ఇస్తుంది. తాజాగా నారా లోకేష్ సైతం జ్యోతులని పరామర్శించారు. అయితే జ్యోతుల ఫ్యామిలీ పార్టీ మారే అవకాశాలు అసలు కనిపించడం లేదు.

పైగా టీడీపీలో ఉంటే జ్యోతులకు జగ్గంపేట సీటు ఖాయమే. అటు ఆయన తనయుడు నవీన్‌కు కాకినాడ పార్లమెంట్ సీటు ఇచ్చే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ వైసీపీలోకి వెళితే జ్యోతుల ఫ్యామిలీకి ఈ ఆప్షన్ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీలో ఖాళీలు లేవు. మొత్తానికైతే జ్యోతుల ఫ్యామిలీ మాత్రం టీడీపీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Discussion about this post