ఏపీ-తెలంగాణల మధ్య నీటి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ అంటుంది. అలాగే అక్కడ నేతలు జగన్, వైఎస్సార్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు ఏపీ నేతల ఏమో సైలెంట్‌గా మాట్లాడుతూ, ప్రాజెక్టు సక్రమంగానే నిర్మిస్తున్నామని, తెలంగాణనే పలు అక్రమ ప్రాజెక్టులు కట్టిందని, శ్రీశైలంలో అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని చెప్పి సీఎం జగన్, కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై మరొకసారి జగన్ మాట్లాడారు. కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కానీ తాము పక్కరాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలని అనుకుంటున్నామని చెబుతూనే, తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి కెపాసిటీ పెంచి ప్రస్తుతం నీళ్లు వాడుకుంటున్నారని, శ్రీశైలంలో కెపాసిటీ మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. తాను పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టనని, అందరితో సఖ్యతగా ఉంటానని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు… పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను కడుతుంటే ఆయన గాడిదలు కాస్తున్నారా అని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ మీద ఫైర్ అవ్వలేక జగన్, చంద్రబాబు మీద ఫైర్ అవుతున్నారని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణ కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేసిన జగన్…సీఎం అయ్యాక అదే ప్రాజెక్టు ఓపెనింగ్‌కు వెళ్ళి గాడిదలు కాసారా అని ప్రశ్నిస్తున్నారు.
మొన్నటివరకు రాసుకుని, పూసుకుని తిరిగిన కేసీఆర్, జగన్‌లు ఇప్పుడు సడన్‌గా నీటి వివాదం తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అసలు కేసీఆర్-జగన్‌లకు అంత సఖ్యత ఉంటే కూర్చుని మాట్లాడుకోవచ్చుగా అని అడుగుతున్నారు. ఇదంతా రాజకీయ డ్రామా అని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.
Discussion about this post