బీజపీ రాజు గారు అంటే విశాఖలో విష్ణు కుమార్ రాజునే చెప్పుకోవాలి. ఆయన 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి గెలిచారు. ఆ తరువాత శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఇక 2019 ఎన్నికల్లో అదే సీటు నుంచి పోటీ చేస్తే ఓడిపోయారు. ఇక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఇపుడు మాత్రం ఆయన దూకుడు చేస్తున్నారు. జగన్ మీద ప్రతీ రోజూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విశాఖ బీజేపీకి పెద్ద నాయకుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా వెళ్ళిపోవడంతో రాజు గారి దూకుడు బాగా పెరిగింది అంటున్నారు. అంతే కాదు ఏపీ బీజేపీ లీడర్లలో తానూ ఒక నేతలా ఉండాలని ఆయన ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

బీజేపీలో నాయకులు విమర్శలు చేస్తారు కానీ కొంత సహనం చూపిస్తారు. కానీ రాజు గారు మాత్రం హద్దులు దాటేస్తున్నారు. జగన్ సర్కార్ ని ఆయన ఒక్క లెక్కన విమర్శిస్తున్నారు. ఇంతటి దారుణమైన సర్కార్ ఇంతకు ముందు లేదు, ఇక రాబోదూ అంటున్నారు. బీజేపీ నేతలు విధానాల మీద విమర్శలు చేతారు కానీ రాజు గారు మాత్రం ఏకంగా జగన్ని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో అయోమయం ప్రభుత్వం ఉందని గతంలో ఆయన కామెంట్స్ చేసిన సంగతి విధితమే. దాని కంటే ముందు ఏపీలో ప్రభుత్వం అన్నది ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు.

ఇలా రాజు గారి బండి స్పీడెక్కడం వెనక చాలా వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. బీజేపీలో ఏదో నాటికి స్టేట్ ప్రెసిడెంట్ కావడం అన్నది ప్లాన్ అంటున్నారు. అంతే కాదు ఈ రకమైన విమర్శలు చేయడం ద్వారా హై కమాండ్ దృష్టిలో తానుంటే రేపటి రోజున అది తన భవిష్యత్తు పాలిటిక్స్ కి హెల్ప్ అవుతుందని కూడా భావిస్తున్నాఉట. మరో విషయం ఏంటి అంటే సీనియర్ నేత పీవీ చలపతిరావు కుమారుడు పీవీన్ మాధవ్ కి పోటీగా రాజు ముందుకు వస్తున్నారు.
దాంతో విశాఖ రాజకీయాల్లో దూసుకుపోవాలన్నదే ఆయన ఆలోచనని చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే రాజు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నా ఖండించే వారు కానీ రెస్పాండ్ అయ్యేవారు కానీ వైసీపీలో కనిపించడంలేదు. దాంతో రాజు జోరు ఎంత చేసినా బండి మాత్రం అక్కడే ఉంటుందని కూడా సెటైర్లు పడుతున్నాయి.

Discussion about this post