కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ అధికార వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నందికొట్కూరు నుంచి తొగురు ఆర్థర్ వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ నుంచి పార్టీ ఇన్చార్జిగా యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి మధ్య గత ఎన్నికల తర్వాత నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బైరెడ్డిని సంతృప్తి పరిచేందుకు శాప్ జగన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పార్టీకి ఎవరు దిక్కు లేని సమయంలో బైరెడ్డి తన పెదనాన్న అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని ఎదిరించి మరి పార్టీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో అక్కడ ఆర్థర్ గెలుపు లో బైరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికలు ముగిసిన కొద్ది నెలల నుంచి ఇద్దరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి.

పార్టీ నేతలు జిల్లాకు చెందిన మంత్రులు , ఇన్చార్జి మంత్రులు ఎన్నిసార్లు చేసినా కూడా వీరి మధ్య పంచాయితీలు చేసినా కూడా వీరు కలవడం లేదు. తాజాగా బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డికి శాప్ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేతలు అందరూ ఆయన ప్రమాణ స్వీకారానికి విజయవాడ తరలివెళ్లారు. జిల్లాలోని ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా బై రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అయితే బై రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం లో మాత్రం ఎమ్మెల్యే ఆర్థర్ ఆయన వర్గీయులు కనిపించ లేదు. దీనికి కారణం ఏంటా ? అని ఆరా తీస్తే బైరెడ్డి ఆర్డర్‌ను ఆహ్వానించలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

బైరెడ్డి దూకుడుకు ఎమ్మెల్యే అంటే లెక్కలేని తనం గా ఉన్న అధిష్టానం ఆయనకు కళ్ళెం వేయయ్యి లేదు సరికదా కీలక పదవులు కట్టబెట్టి తనను అవమానించిందన్న ఆవేదన ఆర్డర్లో ఉందని అంటున్నారు. ఏదేమైనా బైరెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్‌ను ఆహ్వానించకపోవడం వైసీపీలో ప్రకంపనలు రేపుతుంది. ఏదేమైనా జగన్ కూడా స్థానిక ఎమ్మెల్యేను కలుపుకుని పోవాలని చెప్పినా కూడా బైరెడ్డి లెక్కచేయలేదనే అంటున్నారు.
Discussion about this post