ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ళు దాటేసింది. జగన్ గత ఎన్నికల్లో గెలిచి 25 మందితో తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. మరో మూడు నెలల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యి రెండున్నరేళ్లు పూర్తవుతుంది. దీంతో జగన్ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రులలో ఎవరిని ఉంచాలి ? ఎవరిని తొలగించాలన్న దానిపై జగన్ కసరత్తులు అయితే చేస్తున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ అందరు మంత్రుల పనితీరుపై ఇప్పటికే రెండు మూడు సార్లు సర్వే చేయించుకుని ఓ నివేదిక తెప్పించుకున్నట్టు వైసీపీ గ్రూపుల్లోనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ నుంచి బయటకు వెళ్లే మంత్రుల లిస్ట్ ఇదేనంటూ ఓ మెసేజ్ కూడా వైరల్ అవుతోంది. ఈ మెసేజ్లో 11 మంది మంత్రుల పనితీరు ఏ మాత్రం సంతృప్తిగా లేదని అంటున్నారు. వీరు కనీసం పాస్ మార్కులు కూడా వేయించు కోలేకపోవడంతో వీరిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారనే తెలుస్తోంది.

ఈ లిస్టులో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముందువరుసలో ఉన్నారని టాక్. ఇక డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణిని కూడా తప్పించేస్తారట. ఇక హోం మంత్రి మేకతోటి సుచరితను తప్పించకపోయినా శాఖ మార్చేస్తారని తెలుస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ పేర్లు కూడా అవుట్ లిస్టులో ఉన్నాయి.

ఇక భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా అవుట్ లిస్టులో ఉంది. అయితే అప్పలరాజు ను తప్పిస్తారా ? లేదా ? అన్నది సందిగ్ధంలో ఉంది. మరి జగన్ మదిలో ఎవరు అవుట్ అవుతారో ? ఆ లిస్టులో ఎవరు ? ఉన్నారో ? చూడాలి.
Discussion about this post