ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు ఎప్పుడు చేసిన ఖచ్చితంగా ఓ 9 మంది మాత్రం క్యాబినెట్ నుంచి బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు అవకాశం దక్కని వారికి మరో రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసి మంత్రులుగా అవకాశం ఇస్తానని జగన్ చెప్పారు.

ఇక ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. అంటే మరో నాలుగైదు నెలల్లో మార్పులు చేస్తారా లేక ఇంకో ఆరు నెలలు పొడిగించి మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేస్తారో తెలియదు గానీ, ఎప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేసిన 9 మంది మంత్రుల పదవులు అయితే ఖచ్చితంగా పోతాయని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. అయితే పనితీరు బాగోని మంత్రులని నెక్స్ట్ కొనసాగించే ప్రసక్తి లేదని జగన్ మొదట్లోనే తేల్చిచెప్పేశారు. ఇదే క్రమంలో 9 మంది మంత్రుల పనితీరు మరీ ఘోరంగా ఉందని రిపోర్టులు వచ్చాయంట.ఆ మంత్రులు పనితీరుకు సగానికి సగం మార్కులు కూడా కాదు…అసలు పాస్ మార్కులు అంటే 35 కూడా రాలేదట. ఇలా వరెస్ట్ మార్కులు తెచ్చుకున్న మంత్రులని జగన్ పక్కనబెట్టడం ఖాయమని తెలుస్తోంది. అలాగే 50 మార్కులు కంటే తక్కువ తెచ్చుకున్నవారిని కూడా జగన్ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగే లోపు పికప్ కాకపోతే, వారిని పక్కనబెట్టేయడం ఖాయమని తెలుస్తోంది.

ఏదేమైనా జగన్ క్యాబినెట్ నుంచి ఆ 9 మంది మంత్రులు మాత్రం బయటకు వెళ్ళడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ లిస్టులో కొత్త వారు, రాజకీయ పరిజ్ఞానం లేని వారు, జూనియర్లు ఎక్కువుగా ఉన్నట్టు తెలుస్తోంది.
Discussion about this post