కడప జిల్లా పులివెందుల….ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా. ఇక్కడ మరో నాయకుడు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. చాలా వరకు రెడ్డి వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ పులివెందులలో దశాబ్దాల కాలం నుంచి వైఎస్సార్ ఫ్యామిలీ హవా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఏ ప్రత్యర్ధి అయినా వైఎస్సార్ ఫ్యామిలీ మెజారిటీ తగ్గించాల్సిందే తప్ప, ఓడించలేరు.

అయితే చాలా కాలం వైఎస్సార్ ఫ్యామిలీపై టిడిపి తరుపున సతీశ్ రెడ్డి ఫైట్ చేస్తూ వచ్చారు. పులివెందులలో ఈయనకు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నిసార్లు ఓటమి పాలైన ఈయన్ని అక్కడ జనం అభిమానించే వారు. ఇలా టిడిపి తరుపున వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ వస్తున్న సతీశ్..గత ఎన్నికల్లో జగన్‌పై దాదాపు 90 వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అక్కడ నుంచే సతీశ్ రాజకీయాలకు దూరమయ్యారు.

పైగా జగన్ అధికారంలోకి రావడంతో సతీశ్ రెడ్డి సైడ్ అయిపోయారు. టిడిపికి రాజీనామా చేసేసి రాజకీయాలకు దూరం జరిగారు. దీంతో చంద్రబాబు వెంటనే పులివెందులకు బీటెక్ రవిని ఇంచార్జ్‌గా పెట్టారు. గతంలో కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీటెక్ రవి టిడిపి తరుపున గెలిచారు. పులివెందులలో బీటెక్ రవికి మంచి ఇమేజ్ ఉంది. ఇక ఈయనే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసే నాయకుడు.

అయితే సతీశ్ రెడ్డి నెక్స్ట్ ఎన్నికల ముందు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కాకపోతే ఆయన వైసీపీలోకి వెళ్తారా లేక మళ్ళీ టిడిపిలోకి వస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొన్న టిడిపికి రాజీనామా చేసినప్పుడే సతీశ్ వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యారు. మరి చూడాలి వచ్చే ఎన్నికల ముందు సతీశ్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో.
Discussion about this post