వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తీవ్రంగా నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలపై వరుస పెట్టి కేసులు వచ్చి పడుతున్నాయి. అటు కార్యకర్తల కావొచ్చు, ఇటు నాయకులు కావొచ్చు, వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టడానికి అందరూ అర్హులే అన్నట్లు సాగుతుంది. ఇప్పటికే పలువురు నాయకులని జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే కార్యకర్తలని సైతం వదలకుండా కేసులు పెట్టేస్తున్నారు.
ఇక మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అయితే వైసీపీ ప్రభుత్వం జీవితాంతం జైల్లోనే పెట్టేలా ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రవీంద్రని పలుమార్లు అరెస్ట్ చేశారు. అలాగే చాలా కేసులు పెట్టారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వివాదరహితుడుగా ఉన్న రవీంద్రపై వైసీపీ ప్రభుత్వం పెట్టని కేసు లేదు. గతంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వైసీపీ నేత హత్య కేసులో కొల్లుని కొన్ని నెలలు జైల్లో పెట్టారు.బెయిల్ మీద బయటకొచ్చాక కూడా ఆయనపై పలు కేసులు పెట్టారు. ఓ గ్రామంలో తన నాయకుడుని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని అక్కడకి వెళితే, వైసీపీ సర్పంచ్ అభ్యర్ధిని బెదిరించారని కేసు పెట్టారు. ఆ తర్వాత పోలింగ్ బూతుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని కేసు పెట్టారు. తాజాగా మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ కొల్లురవీంద్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణల పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపులు తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే కొల్లురవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా మళ్ళీ కొల్లు అరెస్ట్ అయ్యారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం కొల్లు అరెస్ట్ అయ్యేలా ఉన్నారని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ReplyForward |
Discussion about this post