ఏపీలో బీజేపీ వ్యూహం ఒకలా ఉంటే కేంద్రంలో మరోలా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని నిన్న మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు భావించారు. అయితే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత్రం ఎప్పుడు ? ఏం మాట్లాడతారో ? ఎలా వ్యవహరిస్తారో కూడా ఎవ్వరికి అర్థం కాదు. అయితే ఇప్పుడు కేంద్రంలో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మోడీ మాత్రం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఈ ఏడేళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వంపై వ్యక్త మవుతోంది.

తమకు ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత దమ్ము లేకపోతే తమతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను అయినా కలుపుకుని ఈ సారి అధికారంలోకి రావాలని మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు థర్డ్ ఫ్రంట్ కూటమి కూడా బీజేపీ నేతలకు కంట్లో నలుసుగా మారింది. కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ముఖ్య మంత్రులు ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ లిస్టులో మోడీని తీవ్రంగా వ్యతిరేకించే నేతలు చాలా మందే ఉన్నారు.

మమత, అఖిలేష్, మాయావతి కూడా ఈ వరుసలోనే ఉంటారు. అయితే జగన్ మాత్రం థర్డ్ ఫ్రంట్ జోలికి పోవడం లేదు. ఇందుకు జగన్‌కు ఉండాల్సిన భయాలు జగన్‌కు ఉన్నాయి. జగన్‌పై లెక్కలేనన్ని కేసులు ఉండడంతో మోడీ గీసిన గీత దాటే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఏపీ విషయంలో కేంద్రం బీజేపీ పెద్దల ద్వారా ఓ ఆఫర్ వచ్చిందంటున్నారు. మేం మీ జోలికి రాము.. ఏపీలో మేం మీకు పోటీకి రామని చెప్పారట. ఏపీలో చంద్రబాబుతో బీజేపీ చేతులు కలకపోతే వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దింపేందుకు తన వంతుగా సాయం చేస్తామని జగన్ కేంద్ర పెద్దలకు చెప్పిందంటున్నారు.

గత ఎన్నికల్లోనూ బీజేపీ జగన్‌కు సహకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయసాయి లాంటి వాళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో బీజేపీ పెద్దలు జగన్‌కు సుతిమెత్తని వార్నింగ్‌తో కూడిన వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Discussion about this post