జగన్ జైలూ బెయిలూ ఇది ఏపీలో గత కొన్నాళ్ళుగా హాట్ టాపిక్ గానే ఉంది. జగన్ మీద ఏకంగా పదకొండు చార్జిషీట్లు వేసి సీబీఐ కోర్టుకు సమర్పించింది. వాటి మీద గత కొన్నేళ్ళుగా విచారణ సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉండగానే జగన్ మళ్లీ జైలుకు వెళ్తారా అన్న చర్చ కూడా ఉంది. జగన్ 2013 సెప్టెంబర్ లో బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉంటున్నారు అన్న మాట. మరి జగన్ బెయిల్ రద్దు అవాలి అంటే ఆయన కండిషన్లు ఉల్లఘించారు అని కోర్టుకు విన్నవించాలి. ఆ పని సీబీఐ చేస్తుందా అంటే ఇప్పటికే విచారణలో ఉన్న బెయిల్ రద్దు పిటిషన్ మీద తన వాదనలు వినిపించడానికే సీబీఐ ముందుకు రావడం లేదు.
ఈ నెల 1న జరిగిన విచారణలో సీబీఐ కూడా ఈ కేసులో లిఖితపూర్వకమైన పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే 8వ తేదీన జరిగిన విచారణలో జగన్, రఘురామ క్రిష్ణం రాజు తరఫున న్యాయవాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ సీబీఐ మాత్రం యధాప్రకారం పిటిషన్ దాఖలు చేయలేదు. మరి ఈ కేసును మరోమారు వాయిదా వేసిన సీబీఐ కోర్టు ఇక మీదట ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ అయితే ఉంది. జగన్ మీద అనేక చార్జిషీట్లు ఫైల్ చేసిన సీబీఐ ఆయన బెయిల్ రద్దు విషయంలో నోరు విప్పకపోవడంతో ఇపుడు కోర్టు ఎలాంటి డెసిషన్ కి వస్తుంది ఏ రకమైన తీర్పు ఈ కేసులో వస్తుంది అన్న చర్చ అయితే ఉంది.దీని మీద న్యాయ నిపుణులు అయితే దర్యాప్తు ఏజెన్సీగా ఉన్న సీబీఐ తన వాదనలు చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. మరి సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడం కూడా ఆసక్తికరంగానూ ఆశ్చర్యకరంగానూ ఉందని అంటున్నారు. దర్యాప్తు ఏజెన్సీ మౌనంగా ఉంటే కనుక బెయిల్ రద్దు అవుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. మరో వైపు దీని మీద విపక్షాలు సీబీఐ వైఖరిని తప్పు పడుతున్నాయి. ఇక సీపీఐ నేత నారాయణ అయితే ఇంకా ముందుకు వెళ్ళి జగన్ బెయిల్ రద్దు కాదు అనేస్తున్నారు. దానికి కారణాలు ఆయన చెబుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండదండలు జగన్ కి పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. అవి ఉన్నంతవరకూ బెయిల్ రద్దు అయ్యే ప్రసక్తే లేదని కూడా ఆయన కుండబద్ధలు కొట్టేసారు.
అంటే ఇన్నాళ్ళూ టీడీపీ జగన్ మీద చేస్తున్న ఆరోపణలు నిజం అనేలాగాఎన నారాయణ మాటలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అమిత్ షాతోనే సమావేశం అవుతున్న సంగతినీ గుర్తు చేస్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ తన సొంత కేసుల గురించే మాట్లాడుకుంటున్నారని కూడా అంటున్నారు. మరి అదే కనుక నిజమైతే జగన్ వ్యక్తిగతంగా సేఫ్ జోన్ లో ఉన్నా రాజకీయంగా మాత్రం ఇబ్బందులో పడతారని అంటున్నారు. ప్రజలకు ఈ రోజున అన్నీ తెలుసు అని, ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఎవరు వ్యవహరించినా కూడా జనాలే తగిన విధంగా గుణపాఠం చెబుతారు అంటున్నారు. చూడాలి మరి.
Discussion about this post