ఇది నిజమేనా అంటే అవును అన్న మాట ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జగన్ మీద ఒక్క లెక్కన కమలనాధులు మండిపోతున్నారుట. జగన్ తమ చెప్పుచేతలో ఉండడం లేదని వారు అనుమానిస్తున్నారుట. జగన్ వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా వారికి అనుమానంగా ఉందిట. తాము ఏపీలో జగన్ కి రాజకీయ రక్షణ కవచంగా ఉన్నా కూడా జగన్ నుంచి ఆశించిన స్థాయిలో కోపరేషన్ రావడం లేదని వారు మధన పడుతున్నారుట.
జగన్ మీద బీజేపీ పెద్దల కోపం ఏ రేంజిలో ఉందంటే రాబోయే రోజులలో ఏమైన సంచలన సంఘటనలు నమోదు అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. దీనికంతటికీ కారణం ఏంటి అంటే జగన్ గడ్డం పట్టుకుని మరీ కేంద్ర పెద్దలు బతిమాలారు. అమిత్ షా అయితే జగన్ ని డిన్నర్ కి ఆహ్వానించి మరీ బాగా చనువు ఇచ్చారు. ఎన్డీయేలో జగన్ని చేరమని ఆ డిన్నర్ మీట్ లోనే ప్రతిపాదన పెట్టారు. అది మీకూ మాకూ కూడా లాభదాయకమని నచ్చచెప్ప చూశారు. కానీ జగన్ ఆలోచించి చెబుతానని ఏపీకి వచ్చి బీజేపీకి హ్యాండ్ ఇచ్చారని టాక్.దాంతో పాటు కొంతమంది సీనియర్ బీజేపీ నేతలతో రాయబేరాలు నడిపినా జగన్ అసలు పట్టించుకోలేదుట. దాంతో బీజేపీ పెద్దలకు కోపం కట్టలు తెంచుకుంటోందిట. జగన్ మొండితనం ఏంటి అని వారు తర్కించుకుంటున్నారుట. తాము కోరి మరీ పదవులు ఇస్తామంటే తీసుకోవడానికి ఏంటి బాధ అని కూడా అంటున్నారుట. జగన్ ఎంపీలు కేంద్రంలో ఉంటే కొత్త మిత్రులు ఎన్డీయలో చేరారని, తాము పటిష్టంగా ఉన్నామని చెప్పడానికి బీజేపీకి వీలు కుదిరేది అంటున్నారు.
కానీ ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే పలచబడిపోయింది అన్న సంకేతాలు జాతీయ స్థాయిలో వెళ్ళాయి. దాంతో కమలనాధులు తమ కోపం అంతా జగన్ మీద చూపిస్తున్నారుట. దీంతో రెండేళ్ల సీఎం గా పాలన పూర్తి చేసిన జగన్ విషయంలో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అన్న మాట ఉంది. మరో వైపు జగన్ ఏ డిమాండ్ పెట్టినా కేంద్రం అసలు పట్టించుకోదు అన్న మాట కూడా వినిపిస్తోంది.
Discussion about this post