తమకు 151 సీట్లు ఇచ్చారని, తాము ఏది చెప్పిన జనం నమ్మేస్తారని అధికార వైసీపీ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఏపీలో అధికార వైసీపీ నేతలు చెప్పే మాటలకు విశ్వసనీయత ఎక్కువగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ జనం మాత్రం తాము చెప్పినదే వేదవాక్కుగా భావిస్తారని భ్రమలో ఉండిపోతున్నారు. అయితే ఇక్కడ కొందరు వైసీపీ నేతలు సబ్జెక్ట్ తెలియక ఏదో ఏదో మాట్లాడేస్తారని అనుకుంటే, ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పూర్తిగా అబద్ధాలు చెబుతూ, ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

ఇప్పుడు వైసీపీలో జగన్ తర్వాత అంతా సజ్జల అనే విధంగానే వ్యవహారం నడుస్తున్న విషయంలో తెలిసిందే. ఏ అంశంలోనైనా సజ్జలనే మీడియాలో సమావేశం మాట్లాడాల్సిందే. ప్రతిరోజూ ఈయన మీడియాలోనే ఉంటున్నారు. తాజాగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న టీడీపీకి కౌంటర్ ఇవ్వడంలో భాగంగా సజ్జల మీడియా సమావేశం పెట్టారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.4 వ్యాట్ పెంచిందని, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేశారని, ఇప్పుడు జగన్ ప్రజల భారం పడకుండా పాలన చేస్తున్నారని అన్నారు.

ఇక ఇక్కడే సజ్జల ఏ విధంగా లాజిక్ మాట్లాడారో అర్ధం చేసుకోవచ్చని టీడీపీ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో వ్యాట్ పెంచిన, మళ్ళీ రూ.2 తగ్గించారని, అప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయో, ఇప్పుడు ఎంత ఉన్నాయో ప్రజలకు బాగా తెలుసని అంటున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో పెట్రోల్ రూ.105 ఉంటే, ఏపీలో రూ.110 వరకు ఎందుకు ఉందో సజ్జలనే చెప్పాలని అడుగుతున్నారు.

అసలు చంద్రబాబు హయాంలో ఎందులోనూ చార్జీలని పెంచలేదని, ఆర్టీసీ చార్జీలని అసలు పెంచలేదని, కానీ ఇప్పుడు ఆర్టీసీ, కరెంట్ చార్జీల బాదుడు… ఆస్తి పన్ను పెంపు, కొత్తగా చెత్త పన్ను…ఇక పెట్రోల్, డీజిల్‌లపై బాదుడు గురించి చెప్పాల్సిన పని లేదని, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అంటున్నారు. అయినా సరే సజ్జల లాంటి వారు కూడా చంద్రబాబుపై నిందలు వేస్తూ రాజకీయం చేస్తున్నారని, ఓ రకంగా ఇదే టీడీపీకి ప్లస్ కూడా అవుతుందని చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ఏం చెప్పిన నమ్మేస్తారని అనుకోవడం వైసీపీ నేతలు అవివేకమని మాట్లాడుతున్నారు.
Discussion about this post