ఎస్ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఇదే విషయం హైలెట్ అవుతోంది. ఆయన పేరుకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పిన పనులు కూడా కావడం లేదు. గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని మరీ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండేళ్ల పాటు ఎంతో కష్టపడినా కూడా తన నియోజకవర్గంలో పార్టీ సలహాదారులు వేళ్లు పెట్టేసి ఆ ఎమ్మెల్యేను ముప్పు తిప్పలు పెడుతున్నారట. చివరకు నియోజకవర్గ స్థాయి పదవుల విషయంలోనూ వాళ్లే జోక్యం చేసుకుంటోన్న పరిస్థితి. ఆ ఎమ్మెల్యే ముందు నుంచి వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుపోతున్నారు.
పైగా జిల్లా వైసీపీలో ఓ కులం నేతల ఆధిపత్య ధోరణితో ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్లెవ్వరు కూడా పైకి చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక గత ఎన్నికల్లో సీటు కోసమే కోట్లాది రూపాయలు సమర్పించుకున్న సదరు ఎమ్మెల్యే.. గెలిచేందుకు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేశారు. పైగా టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని ఆయన బద్దలు కొట్టి మరీ ఎమ్మెల్యే అయ్యారు. అటు వ్యాపార పరంగా కూడా చాలా నష్టపోయారు. సరే ఎమ్మెల్యేగా గెలిచాను.. తన వ్యాపారాలు తాను చేసుకుందామన్నా దానికి కూడా అధికార పార్టీ నుంచి ఎలాంటి సహాయం ఉండడం లేదట.
ఇక గత ఎన్నికల్లో పెట్టిన కోట్లాది రూపాయలకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో సదరు ఎమ్మెల్యే ఉన్నారట. చీ దీనమ్మ జీవితం.. వైసీపీలోకి ఎందుకు వచ్చానా ? ఎందుకు ఎమ్మెల్యే అయ్యానా ? ఆయన తెగ బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే టీడీపీలో ఆయనకు ఉన్న పరిచయాల నేపథ్యంలో వాళ్లతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తానని హామీ ఇస్తే.. ఎన్నికలకు కాస్త ముందుగానే తాను వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేస్తానని కండీషన్ పెట్టారట.అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేత ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు కూడా క్లీన్ ఇమేజే ఉంది. అయితే పార్టీలో సీనియర్‌ను కాదనుకుని ఇప్పుడున్న ఎమ్మెల్యే టీడీపీలోకి వచ్చినా బాబు సీటు ఇస్తారా ? అన్నది డౌటే ? ఏదేమైనా ఆ ఎమ్మెల్యేకు వైసీపీలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆయన బాధే చెపుతోంది.
Discussion about this post