May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే..ఆ సీటు కోసమేనా?

రాష్ట్రంలో టి‌డి‌పి హవా పెరుగుతుంది…తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా వెళుతుంది. ఇప్పటికే టి‌డి‌పిలో సీట్ల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందినవారు సైతం టి‌డి‌పిలోకి రావడానికి చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టి‌డి‌పిలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయాక, ఆ పార్టీకి చెందిన నేతలు బి‌జే‌పి, వైసీపీలోకి జంప్ చేశారు అలాంటి పరిస్తితి నుంచి ఇప్పుడు టి‌డి‌పిలోకి వైసీపీ, బి‌జే‌పి నేతలు వచ్చే పరిస్తితి.

ఇప్పటికే బి‌జే‌పికి చెందిన కొందరు నేతలు టి‌డి‌పిలోకి వచ్చారు. అటు వైసీపీ నేతలు కూడా టి‌డి‌పి వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బి‌జే‌పి నేత టి‌డి‌పి వైపు చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పితో బి‌జే‌పి పొత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ బి‌జే‌పి…జగన్ వైపే ఉంది. ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తుకు రెడీగా లేదు. దీంతో టి‌డి‌పి-బి‌జే‌పి పొత్తు ఉండదని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే కొన్ని సీట్లు వస్తే పోటీ చేయాలని కొందరు నేతలు కాచుకుని ఉన్నారు. కానీ పొత్తు ఉండదని తేలడంతో..బి‌జే‌పి నేతలు టి‌డి‌పిలోకి రావడానికి రెడీ అయ్యారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..టి‌డి‌పిలోకి రావడానికి రెడీ అయ్యారు. ఈయన 2014లో టి‌డి‌పితో పొత్తులో భాగంగా బి‌జే‌పి నుంచి పోటీ చేసి విశాఖ నార్త్ గెలిచారు. 2019 ఎన్నికల్లో పొత్తు లేకపోయినా బి‌జే‌పి నుంచి పోటీ చేసి 20 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు టి‌డి‌పితో పొత్తు ఉంటే అక్కడే పోటీ చేయాలని అనుకున్నారు. పొత్తు లేదని తేలడంతో ఆయన టి‌డి‌పి వైపుకు రావడానికి చూస్తున్నారు.

మొదట నుంచి ఈయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా యర్రగొండపాలెంలో బాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్ళ దాడిని ఖండించారు. దీంతో ఆయన టి‌డి‌పి పట్ల పాజిటివ్ గా ఉన్నారని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పిలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఇక టి‌డి‌పిలోకి వచ్చి విశాఖ నార్త్ సీటు తీసుకోవాలని చూస్తున్నారు. అటు నార్త్ లో గంటా శ్రీనివాసరావు ఉన్నారు..ఈ సారి గంటా వేరే సీటులోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడాలి మరి విష్ణుకుమార్ రాజు టి‌డి‌పిలోకి వస్తారో లేదో.