ఏపీలో టీడీపీకి ఇదో విపత్కర పరిస్థితి అని చెప్పాలి. కీలకమైన విజయనగరం జిల్లాలో పార్టీని నడిపించే నేత కూడా ఇప్పుడు పార్టీకి లేకుండా పోయారని అంటు న్నారు రాజకీయ పరిశీలకులు. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు, చీపురుపల్లి ఇన్‌చార్జ్‌గా ఉన్న కిమిడి నాగార్జున వ్యవహరిస్తు న్నారు. ఆయన యువకుడు కావడంతో పాటు సామాజిక సమీకరణలు ( తూర్పు కాపు) కోణంలో చంద్రబాబు ఆయనకు ఈ పదవి ఇచ్చినా ఆయన వైజాగ్‌లో ఉంటూ నియోజకవర్గ, పార్లమెంటరీ ప్రాంత పరిధిలో పార్టీని విస్మరిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. పైగా అక్కడ బోత్స తో పాటు బొత్స ఫ్యామిలీని, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా నడప లేకపోతున్నారని కూడా టీడీపీ నేతలే చర్చించు కుంటున్నారు.
పైగా ఆయన వైజాగ్‌లో నివాసం ఉంటున్నాడు.. ఆయనకు చీపురుపల్లిపైనే ఇంకా పట్టు చిక్కలేదు. ఒక నియోజకవర్గాన్ని కూడా డీల్ చేసే సత్తా లేని నేతకు ఏకంగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇవ్వడంతో ఆయన వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదనే అంటున్నారు. విజయనగరంలో పార్టీని పటిష్టం చేసే ప్లాన్ కూడా నాగార్జునకు లేదనే అంటున్నారు. అక్కడ అశోక్ గజపతి రాజును వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసినా కూడా అక్కడ దానిని క్యాష్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లి.. పార్టీని బలోపేతం చేయడం కూడా నాగార్జునకు చేత కాలేదనే అంటున్నారు.
ఉన్నంతలో అశోక్ కుమార్తె అతిథి, అటు బొబ్బిలి రాజులు, గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు లాంటి వాళ్లే యాక్టివ్ గా ఉన్నారని అంటున్నారు. ఇక చాలా మంది నేతలు మంత్రి బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. కీలక నేతల ఫోన్లకు కూడా స్పందించడం లేదని తెలుస్తోంది. అసలు నాగార్జునకు పార్టీ లో చీరుపుపల్లి ఇన్ చార్జ్, ఇటు పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవులు ఇచ్చినా ఉపయోగం లేదనే అంటున్నారు.
Discussion about this post