ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక…రాజకీయాలు ఎలా మరాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్ధి పార్టీ నాయకులపై కక్ష సాధించడం, వారిని బూతులు తిట్టడమే పెద్ద రాజకీయం అయిపోయింది. అసలు రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి. కానీ బూతులు మాట్లాడలేనిదే ఉండలేమనే విధంగా వైసీపీ నేతల వైఖరి ఉంది. అసలు చంద్రబాబు, నారా లోకేష్‌లని ఉద్దేశించి ఏ స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక వైసీపీ నేతలకు కాస్త కౌంటర్లు ఇవ్వడంలో టీడీపీ నేతలు ఇంతకాలం వెనుకబడే ఉన్నారనే చెప్పొచ్చు.

వైసీపీ నేతలు మాదిరిగా పెద్దగా బూతులు మాట్లాడకుండా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ తాజాగా రమ్యశ్రీ హత్య ఘటనలో, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్‌పై వైసీపీ నేతలు ఏ స్థాయిలో బూతులు మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కొడాలి నాని, మేరుగు నాగార్జున, నందిగం సురేష్‌లు లోకేష్‌ని దారుణంగా తిట్టారు. అయితే ముల్లుని ముల్లుతోనే తీయాలనే విధంగా టీడీపీ నేతలు కూడా అదే బూతులతో వైసీపీ నేతలకు సమాధానం చెప్పారు.

టీడీపీ నాయకుల్లో ఇంత ఫైర్ ఉందని అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యలరావు, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజులని చూస్తే అర్ధమైంది. ఈ ఇద్దరు నాయకులు ఓ రేంజ్‌లో కొడాలి నాని, మేరుగు నాగార్జున, సురేష్‌లపై విరుచుకుపడ్డారు.ఊహించని విధంగా ఈ ఇద్దరు నాయకులు కూడా బూతులతో వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. అసలు టీడీపీలో ఇలా మాట్లాడే నాయకులు కూడా ఉన్నారని ఆశ్చర్యపోయేలా చేశారు. ఎడాపెడా వైసీపీ నేతలని వాయించేశారు.

వాళ్ళ మాటలు వింటే వైసీపీ నేతలు ఏమైపోతారా అనే విధంగా ఇద్దరు నాయకులు ఫైర్ అయ్యారు. కాకపోతే రాజకీయాల్లో ఇలా బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు. కానీ వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వాలంటే ఈ రేంజ్‌లో మాట్లాడాల్సిందే అని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.
Discussion about this post