ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒకప్పుడు ఉన్న మహిళా నాయకులు.. పార్టీని ముందుకు నడిపించడంలో ఎం తో శ్రమించారు. పార్టీ కోసం నిరంతరం పాటు పడ్డారు. పదవులు ఇచ్చారా? ఇవ్వలేదా? అనే విషయా లను కూడా పక్కన పెట్టి.. తమంతట తాముగా ఎదిగారు. పార్టీ ఎదుగుదలకు పాటుపడ్డారు. అయితే.. ఇప్పుడు.. అలాంటి నాయకురాళ్లు కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఆది నుంచి కూడా టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. మహిళలకు ఆశించిన మేరకు సీట్లను కేటాయిస్తూ.. మహిళా రిజర్వేషన్‌కు పరోక్షంగా ప్రోత్సహిస్తున్న పార్టీగా గుర్తింపు ఉంది.

ఈ క్రమంలోనే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఉన్న కాలం నుంచి కూడా అనేక మంది మహిళా నాయకులు వెలుగులోకి వచ్చారు. రేణుకా చౌదరి(ఇప్పుడు కాంగ్రెస్), నన్నపనేని రాజకుమారి నుంచి పడాల అరుణ, శోబా హైమావతి(ఇటీవలే పార్టీకి దూరమయ్యారు), శమంతకమణి(ప్రస్తుతం వైసీపీ), మాజీ స్పీకర్ ప్రతిభా భారతి.. ఇలా.. అనేక మంది నాయకురాళ్లు.. పార్టీని ముందుకు నడిపించారు. ఇక, మధ్య సినీ రంగం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు పార్టీ కోసం శ్రమించిన నాయకురాళ్లు కూడా ఉన్నారు.

వీరిలో ఎక్కువ మంది పార్టీ పదవుల కోసం కాకుండా.. పార్టీ కోసమే అన్నట్టు పనిచేయడం గమనార్హం. అంతే కాదు, సబ్జెక్టుపై అవగాహన పెంచుకుని.. పార్టీ లైన్‌కు అనుగుణంగా ముందుకు సాగారనే పేరు తెచ్చుకు న్నారు. అంతేకాదు, నిత్యం ప్రజల్లోనూ ఉన్నారు. అందుకే కొందరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవ ర్గాల్లో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయని అంటున్నారు. కానీ, ఇప్పుడు ఈ తరహా నాయకురాళ్లు కనిపించ డం లేదనే వాదన వినిపిస్తోంది. తమ తమ నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేయడం లేదని.. తమకంటూ.. ఒక వ్యూహం లేకుండానే ముందుకు సాగుతున్నారని.. ప్రస్తుతం ఉన్న నాయకురాళ్లపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏదో విమర్శించాలి కనుక విమర్శించడం.. మీడియాలో ప్రొజెక్టు అవుతామనే ఉద్దేశంతోనే ముందుకు రావడం.. ఒక వ్యూహం లేకపోవడం.. వంటివి.. ఇప్పుడు టీడీపీ మహిళా నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన అంశాలు. అదేసమయంలో నాయకురాళ్లు కూడా తగ్గిపోవడం మరో ప్రధాన ఇబ్బందిగా మారింది. ఒకప్పుడు లెక్కకు మిక్కిలి సంఖ్యలో ఉన్న లేడీ టీడీపీ లీడర్లు.. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. దీనికి ప్రధానంగా.. ఎంత చేసినా గుర్తింపు లేదనే భావన, పార్టీలో పురుషాధిపత్యం పెరిగిపోయిందనే ఆవేదన కారణంగా మహిళా నేతలు పుంజుకోవడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా మహిళా ఓటు బ్యాంకు కోసం.. మహిళా నేతలను ప్రోత్సహించాలని అంటున్నారు.

Discussion about this post