ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు సోషల్ మీడియా ద్వారానే రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఏపీలో కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. అలాగే వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలు పోటాపోటిగా ఉంటాయి.

అయితే ఏది ఎలా ఉన్న టీడీపీ కంటే వైసీపీ సోషల్ మీడియానే ఒక అడుగు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. తమ అధినేత జగన్‌ని గానీ, తమ పార్టీపైన గానీ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే నిమిషాల్లో స్పందిస్తూ, సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నట్లే కనిపిస్తోంది. వైసీపీని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడంలో టీడీపీ సోషల్ మీడియా ఫెయిల్ అవుతున్నట్లు ఉంది.

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…చంద్రబాబు తాగే మంచినీటి బాటిల్‌తో సహ వైసీపీ సోషల్ మీడియా నెగిటివ్ చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపడంలో టీడీపీ వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు పెట్టి మరీ వైసీపీ సోషల్ మీడియాని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక ఆర్గనైజేషన్ మాదిరిగా ముందుకు తీసుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియాకు తిరుగులేకుండా పోతుంది.

ఇటు టీడీపీ సోషల్ మీడియాలో కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, పార్టీ కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో ఎప్పుడు ఏ పోస్టు పెడితే వైసీపీ ఇబ్బంది పెడుతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వైసీపీ సోషల్ మీడియా అంత పవర్‌ఫుల్‌గా టీడీపీ సోషల్ మీడియా లేదనే చెప్పొచ్చు.
Discussion about this post