టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది…ఇంకా అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాలి..ప్రస్తుతానికి అనధికారికంగా మాత్రం పొత్తుపై ప్రకటన వచ్చేసింది. అటు చంద్రబాబు ఇటు పవన్ పొత్తుకు రెడీ అయ్యారు. ఇక టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి మాత్రం కాస్త డ్యామేజ్ తప్పదని చెప్పవచ్చు. అందులోనూ కొందరు నేతలు గెలవడం మళ్ళీ డౌటే అని చెప్పవచ్చు. అది కూడా గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ నుంచి కొందరు గెలిచారు.

అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీపై వచ్చిన మెజారిటీల కంటే వారి స్థానాల్లో జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. దీని బట్టి చూస్తే టీడీపీ-జనసేన కలిస్తే ఏం అవుతుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ రెండు పార్టీల పొత్తు వల్ల వైసీపీలో కొందరు మంత్రులకు మళ్ళీ గెలుపు డౌట్ అని చెప్పవచ్చు. పొత్తు ప్రభావం వల్ల జోగి రమేశ్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల్, విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ రావు లాంటి మంత్రుల గెలుపుపై ప్రభావం చూపుతుంది.

గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే వీరు ఈజీగా గెలవగలిగారు. అటు విడదల రజిని, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, రోజా లాంటి వారికి ట్రబుల్ తప్పదు. మాజీ మంత్రుల్లో పేర్ని నాని, కన్నబాబు, ఆళ్ళ నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, రంగనాథ రాజు…ఇలా కొందరు మాజీ మంత్రులపై కూడా టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం ఉండనుంది. మొత్తానికి పొత్తు వల్ల వైసీపీకి డ్యామేజ్ తప్పదు.

Leave feedback about this