నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడానికి టిడిపి-జనసేన ఏకమవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తులో పోటీ చేసి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి..రెండు పార్టీలు పొత్తులో బరిలో దిగుతున్నాయి. రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే చాలామంది వైసీపీ దిగ్గజాలు ఓటమిని ఎదుర్కోవాల్సిందే.

గత ఎన్నికల్లో ఎవరైతే జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచారో..వారంతా ఈ సారి గెలవడం గగనమే అని చెప్పాలి. ముఖ్యంగా కొందరు మాజీ మంత్రులకు గెలుపు కష్టమే. టిడిపి-జనసేన కాంబినేషన్ లో ఆ మాజీ మంత్రులు ఓటమి బాటపట్టక తప్పదు. అలా ఓటమి బాటపట్టే వారిలో నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచారు. ఈ సారి మాత్రం గెలవడం కష్టమని తెలుస్తుంది.

ఇటు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్తితి కూడా అంతే అని చెప్పవచ్చు. అక్కడ కూడా జనసేన ఓట్ల ప్రభావం ఉంది. టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి గెలుపు గగనమే. ఇటు ప్రత్తిపాడులో మాజీ మంత్రి మేకతోటి సుచరిత పరిస్తితి కూడా అంతే. టిడిపి-జనసేన కలితే సుచరిత డౌట్ లేకుండా ఓడిపోవచ్చు.
ఇక మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మళ్ళీ పోటీ చేయనంటున్నారు..పోటీ చేస్తే ఆయన పరిస్తితి అంతే. అలాగే విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్, ఏలూరులో ఆళ్ళ నాని, ఆచంటలో చెరుకువాడ రంగనాథ రాజు, కాకినాడ రూరల్ లో కన్నబాబు, భీమిలిలో అవంతి శ్రీనివాస్..ఇలా మాజీ మంత్రులంతా ఈ సారి అస్సామే అని చెప్పవచ్చు.