గత ఎన్నికల్లో ముందు కర్నూలు రాజకీయాల్లో బడా ఫ్యామిలీ అయిన కోట్ల కుటుంబం అనూహ్యంగా టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మలు టిడిపి జెండా కప్పుకున్నారు. అలాగే ఆ ఎన్నికల్లో కోట్ల, కర్నూలు ఎంపీగా, సుజాతమ్మ, ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే జగన్ గాలిలో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక కోట్ల కాస్త సైలెంట్ అయ్యారు. ఆయన పెద్దగా పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు.

కానీ సుజాతమ్మ అడపాదడపా పార్టీలో కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆలూరులో పార్టీని బలోపేతం చేయడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అలాగే కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా పోరాడుతున్నారు. అటు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాలపై కూడా గళం విప్పుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆలూరులో కాస్త పార్టీ పికప్ అయినట్లే కనిపిస్తోంది.

అసలు ఇప్పటికే గుమ్మనూరుపై అనేక అక్రమాల ఆరోపణలు వచ్చాయి. ఆలూరులో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని, భూ కబ్జాలు చేశారని, ఈఎస్‌ఐ స్కామ్‌లో ఓ బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని, ఇలా ఒకటి అంటే అనేక ఆరోపణలు జయరాంపై వచ్చాయి. ఇక తాజాగా ఆలూరులో ఇసుకని అక్రమంగా తరలిస్తున్న కొందరిని స్థానిక ఎస్‌ఐ పట్టుకున్నారు. అయితే పట్టుకున్నవారిని వదిలేయాలని, ట్రాక్టర్లని కూడా విడిచిపెట్టాలని మంత్రి జయరాం, ఎస్‌ఐని బెదిరిస్తూ ఓ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అయితే ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో నియోజకవర్గంలో మంత్రిపైగా బాగా యాంటీ వచ్చిందని తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో నెక్స్ట్ జయరాం మంత్రి పదవి కూడా పోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అలాగే ఆలూరులో ఈ సారి మంత్రి గెలవడం కష్టమే అని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఆలూరులో సుజాతమ్మకు బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. నెక్స్ట్ ఆలూరులో టిడిపి జెండా ఎగరవేసేలా ఉన్నారు.

Discussion about this post