ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గత మూడు నెలలుగా తెలుగుదేశం పార్టీ దూకుడు గా ప్రజల్లోకి వెళుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటం చేస్తోంది. గత రెండున్నరేళ్లుగా పార్టీలో ఉన్న స్తబ్దతను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టినట్లుంది. వైసీపీని రెచ్చగొట్టి లబ్ది పొందాలన్నది టీడీపీ ప్రయత్నంగా కన్పిస్తుంది. రెండు సంవత్సరాలుగా పార్టీ నేతల్లో నెలకొన్న నిస్తేజం ఇప్పుడిప్పుడే తొలగుతుంది. నిన్నటి వరకు జగన్ను తిడితే వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది టీడీపీ నేతలు భయపడ్డారు. మరోవైపు తమ వ్యాపారాలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు ఎక్కడ తమపై కేసులు పెడతారో ? ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అని బాధపడ్డారు.

చివరకు టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారు సైతం సొంత పార్టీ కేడర్‌కు సైలెంట్గా ఉండండి ఎందుకు అనవసరంగా కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడడం అని చెప్పారు. దీనిని బట్టి టీడీపీ వాళ్లే దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ఇష్టపడ లేదని తెలుస్తోంది. అయితే గత రెండు మూడు నెలలుగా టీడీపీ ఓవరాల్‌గా గేరు మార్చేసింది. ఉదాహరణకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఉదంతాన్నే తీసుకుంటే రెండేళ్లలో చంద్రబాబు, టీడీపీకి రాని సానుభూతి ఒక్కసారిగా ఈ విషయంలోనే వచ్చింది.

చివరకు అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు సైతం తనను జైలులో పెట్టినా పర్వాలేదని తెగించి మాట్లాడారు. తెగిస్తే పోయేదేం లేదు.. తెడ్డే లింగం అన్నట్టుగా టీడీపీ వాళ్లు తెగింపునకు దిగారు. అందుకే వైసీపీ వాళ్లను కెలుకుతూ రెచ్చగొడుతున్నారు. వైసీపీ వాళ్లు తమను ఎంతగా టార్గెట్ చేస్తే అంత సానుభూతి వస్తుందని టీడీపీ వాళ్లు డిసైడ్ అయిపోయారు. పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప అన్న నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చేశారు. వైసీపీ దూకుడుకు అదే దూకుడు అస్త్రంతో రివర్స్ ఎటాక్ చేయకపోతే ప్రజల్లోకి వెళ్లలేం అన్న విషయం టీడీపీ వాళ్లకు తెలిసి వచ్చింది. అందుకే వాళ్లు తెగించి మరీ దూకుడు రాజకీయం చేస్తున్నారు. ఈ అస్త్రంలో చిక్కుకున్న వైసీపీ విలవిల్లాడుతోంది.

Discussion about this post