ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో పంతానికి పోయి మరి ముందుకు వెళ్తున్నారు. మూడు రాజధానులు విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చినా జగన్ వెనక్కి తగ్గలేదు. జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఏపీకి అసలు రాజధాని అంటూ లేకుండా పోయింది. మరో వైపు ఈ ఎఫెక్ట్‌తో రాష్ట్రాభివృద్ధి కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని పరిస్థితి. ఈ క్రమంలోనే శాసనమండలిలో బిల్లులకు టిడిపి పదేపదే అడ్డుతగులుతూ ఉండడంతో విసుగు వచ్చిన జగన్ చివరకు ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి పార్లమెంటుకు పంపారు. అయితే ఇది జరిగి ఏడాది అయ్యింది. ఇప్పటి వరకు పార్లమెంటులో ఏపీ శాసనమండలి రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజాగా టిడిపికి చెందిన రాజ్యసభ ఎంపీ రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆన్సర్ ఇచ్చారు. ఏపీ శాసన మండలి రద్దు పై అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి పంపిందని… దాని పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేయడంతో కేంద్రం తలుచుకుంటే ఏపీ శాసన మండలి రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై నాన్చుడు ధోరణితో ఉన్న కేంద్రం ఇప్పుడు కనుక మండలిని రద్దు చేస్తే జగన్ కి ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తున్నారు.

ఇప్పటి వరకు మండలిలో వైసిపి బలం లేదు. ఇప్పుడిప్పుడే వైసిపి మండలిలో టిడిపిని డామినేట్ చేస్తోంది. త్వరలోనే 15 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. అప్పుడు మండలిలో వైసిపి సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుంది. పైగా జగన్ చాలామందికి ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది జగన్ కి ఎదురు దెబ్బగా కనపడుతోంది. మరి ఏపీ మండలి రద్దు పై కేంద్రం నిర్ణయం ఎలా ? ఉంటుందో చూడాలి. ఏదేమైనా మోడీ టైం చూసుకుని మరీ జగన్‌కు షాక్ ఇచ్చేలా ఉన్నారు.
Discussion about this post