విజయనగరం నియోజకవర్గం…..అశోక్ గజపతిరాజు కంచుకోట. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ అశోక్ గజపతికి తిరుగులేదు. మొదట జనతా పార్టీ నుంచి 1978లో విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్…ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే 2004 ఎన్నికలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అశోక్ 2009లో మళ్ళీ విజయం సాధించారు.2014లో అశోక్ విజయనగరం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక విజయనగరం అసెంబ్లీలో మీసాల గీత టీడీపీ తరుపున గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి మారింది. అశోక్ మళ్ళీ విజయనగరం ఎంపీగా పోటీ చేయగా, ఆయన తనయురాలు అతిథి గజపతి విజయనగరం అసెంబ్లీ బరిలో నిలబడ్డారు.
కానీ జగన్ వేవ్‌లో ఇద్దరు ఓటమి పాలయ్యారు.ఇద్దరు కూడా స్వల్ప మెజారిటీలతోనే ఓడిపోయారు. అయితే ఓడిపోయిన కూడా అతిథి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా విజయనగరంలో పనిచేస్తున్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. వైసీపీకి ధీటుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నారు.అలాగే కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్ధికంగా అండగా నిలబడుతున్నారు. మళ్ళీ తమ కంచుకోటనే తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం వైసీపీ ఎమ్మెల్యేగా కొలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఈయనకు వయసు మీద పడటంతో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు.
పైగా ప్రభుత్వ పథకాలు మినహా ఇక్కడ వైసీపీ చేసిన అభివృద్ధి ఏం లేదు. దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని గజపతి ఫ్యామిలీ అభివృద్ధి చేస్తూ వచ్చింది.కానీ వైసీపీ వచ్చాక విజయనగరంలో అభివృద్ధి కుంటుపడింది. దీంతో ఇప్పుడు ప్రజలు అతిథి వైపు చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో విజయనగరం ప్రజలు అతిథి వైపే మొగ్గు చూపేలా కనిపిస్తున్నారు. ఏదేమైనా అశోక్ వారసురాలుగా అతిథి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ విజయనగరం ప్రజలకు దగ్గరయ్యారు.
Discussion about this post