జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రభుత్వం ఎందులో అయిన నెంబర్ 1 గా ఉందంటే…అది అప్పుల్లోనే అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు అప్పులు కోసం జగన్ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంది. ఇక ఉన్న ఒక్క ఆర్ధిక మంత్రి రాష్ట్రానికి అప్పులు ఎలా తీసుకురావాలని కష్టపడుతున్నారు. అలాగే నెల నెల అప్పు తీసుకోపోతే రాష్ట్రం ముందుకు వెళ్లని పరిస్తితి ఉంది.

అసలు ఎన్ని రకాలుగా అప్పు పుడుతుందో అన్నీ రకాలుగా ఏపీ ప్రభుత్వం అప్పులు కోసం ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో జగన్ ప్రభుత్వం…మందుబాబాబులని కూడా తాకట్టు పెట్టేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ముందు జగన్ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం గంగలో కలిసిపోయింది. పైగా వీరే సొంత బ్రాండ్లు తయారుచేసి, అధిక ధరలకు అమ్ముతూ మందుబాబుల జీవితాలతో ఆడుకుంటున్నారు.సరే ఎలాగోలా చెత్త బ్రాండ్లు ఉన్నా సరే మందుబాబులు తాగేస్తున్నారు. ఇలా మందుబాబుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న జగన్ ప్రభుత్వం….మందుబాబుల ద్వారా ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలనే విధంగా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మద్యం ఆదాయాన్ని షూరిటీగా పెట్టి రూ.21,500 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇలా అప్పు తీసుకురావడాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుబట్టింది.

అయినా సరే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. మరో రూ.25 వేల కోట్లు అప్పు తీసుకోచ్చేందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ సిద్ధమవుతుంది. ఇక బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకునే అప్పు ప్రభుత్వ ఖాతాలోకే వెళుతుందని తెలుస్తోంది. అంటే పరోక్షంగా బేవరేజెస్ పేరుతో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకోనుందని తెలుస్తోంది. ఇక మద్యపాన నిషేధంలో చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వం..మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టుకుని అప్పు తీసుకుంటుంది. అంటే మందుబాబులు ఎంత ఆదాయాన్ని ఇస్తే అంతగా ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుంది. మొత్తానికి మందుబాబులే ప్రభుత్వాన్ని కాపాడుతున్నట్లు కనిపిస్తోంది.
Discussion about this post