పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం….మొదట నుంచి కాపు సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ కాపులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే విజయం. అయితే ఇక్కడ ఎక్కువసార్లు కాపులు, తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వచ్చారు. టిడిపి ఆవిర్భావించాక జరిగిన ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు విజయం సాధించింది.

ఇక కాంగ్రెస్ ఒకసారి గెలవగా, మరొకసారి ఉపఎన్నికలో గెలిచింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం విజయం సాధించింది. 2014 ఎన్నికలోచ్చేసరికి టిడిపిలో పొత్తులో భాగంగా బిజేపి గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్ ఉండటంతో తాడేపల్లిగూడెంలో వైసీపీ గెలిచింది. వైసీపీ తరుపున కొట్టు సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఇలా జగన్ గాలిలో గెలిచిన కొట్టు రెండేళ్లలో అద్భుతమైన పనితీరు మాత్రం కనబర్చలేదని తెలుస్తోంది.

ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తప్ప, తాడేపల్లిగూడెంలో గొప్పగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. పైగా ఇక్కడ అక్రమాలు కూడా పెరిగిపోయాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు ఇసుకలో, ఇళ్ల స్థలాల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని మొదట్లోనే ఎంపీ రఘురామ ఆరోపించారు. అలాగే టిడిపి, జనసేనలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలైందని తెలుస్తోంది.

ఇలా వైసీపీకి కాస్త యాంటీ ఉన్న టిడిపికి అనుకున్న మేర పాజిటివ్ రాలేదు. ఇక్కడ టిడిపి నాయకులు ఈలి నాని, ముళ్ళపూడి బాపిరాజులు అనుకున్న మేర పనిచేయలేదు. అయితే ఇప్పుడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న వలవల బాబ్జీ దూకుడుగానే పని చేస్తున్నారు. మరోవైపు జనసేన తరుపున బొలిశెట్టి శ్రీనివాస్ సైతం తాడేపల్లిగూడెంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఈ సారి తాడేపల్లిగూడెంలో ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. ఒకవేళ టిడిపి-జనసేనలు గానీ కలిసి బరిలో ఉంటే వైసీపీకి భారీ తగలడం ఖాయం.

Discussion about this post