కరోనా వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు చక్కగా హైదరాబాద్ పారిపోయి, అక్కడ తలదాచుకుంటున్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని.. వాటిని పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, జెడ్పీటీసీ ఎన్నికలని బహిష్కరించినప్పుడే టీడీపీ పని అయిపోయిందని, ఇక ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసేయోచ్చని చెప్పి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఇక ఇంత స్టేట్‌మెంట్ విన్నాక టీడీపీ శ్రేణులు ఎందుకు ఆగుతారు. వాళ్ళు కూడా ఆయనకు తగ్గట్టుగానే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో బాబు హైదరాబాద్‌లో దాక్కున్నారు…నిజమే ప్రజల మధ్యలో తిరిగితే వారిని మరింత ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని చెప్పి, ఇంటి దగ్గరే ఉంటూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ ప్రజల కోసం పోరాడుతున్నారని చెబుతున్నారు. ఒకవేళ ప్రజల కోసమని వస్తే లాక్‌డౌన్ నిబంధనలని ఉల్లంఘించారని వైసీపీ ప్రభుత్వమే కేసు పెడుతుందని, అది లోకేశ్ విషయంలో నిజమైందని గుర్తు చేస్తున్నారు.సరే బాబు ప్రజల మధ్యలోకి రావడం లేదు. మరి నిత్యం జగన్ జనం మధ్యలోనే ఉంటూ, అసలు తాడేపల్లి ప్యాలెస్ ఉన్న విషయమే మర్చిపోయారని, ఆయన తాడేపల్లిలోనే కనిపించడం లేదని కౌంటర్లు వేస్తున్నారు. ఒక సీఎం హోదాలో ఉండి జగన్ జనం మధ్యలోకి వచ్చిన పరిస్తితి లేదని, ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితవుతున్నారు. ఇక వెళితే సచివాలయానికి వెళ్తారు. అటు రాష్ట్రంలో ఎలాంటి శంఖుస్థాపనలు ఉన్నా సరే ఆన్‌లైన్‌లోనే భూమి పూజలు చేస్తున్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే వారికి మద్ధతుగా నిలబడే ప్రయత్నాలు అసలు చేయడం లేదని మండిపడుతున్నారు. ఇక టీడీపీ పని అయిపోతే చంద్రబాబు మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని, మోదీ దగ్గర బెండ్ అవ్వడం బాబుకు తెలియదు కాబట్టి, బీజేపీలో ఎవరు విలీనం అవ్వాలో తేల్చుకోవాలని అంటున్నారు. మొత్తానికైతే మంత్రి బాలినేనికి టీడీపీ శ్రేణులు రివర్స్‌లో కౌంటర్లు గట్టిగా ఇచ్చేశాయి.
Discussion about this post