గత ఎన్నికల్లో జగన్ వేవ్‌ని తట్టుకుని మరీ టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. వారిని పక్కనబెడితే టీడీపీకి ఇప్పుడు 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరి ఈ 19 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉన్నారా? అంటే ప్రస్తుతానికైతే టీడీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల బలం ఏ మాత్రం తగ్గట్లేదని తాజాగా వస్తున్న సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి టీడీపీ తరుపున నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరీ, పెద్దాపురం నుంచి చినరాజప్ప, మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావులు విజయం సాధించారు.

జగన్ గాలికి ఎదురు నిలబడి వీరు గెలిచారు. ఇలా గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉన్నారని తెలుస్తోంది. వీరికి చెక్ పెట్టడంలో అధికార వైసీపీ పూర్తిగా విఫలమైందని విశ్లేషణలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఎలాగో అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి. పైగా అధికార వైసీపీ ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలిసిందే. ఏదొకవిధంగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి టీడీపీ ఎమ్మెల్యేలని వీక్ చేయలేకపోయిందని తెలుస్తోంది.

నాలుగుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉండటంలో ముందున్నారని చెప్పొచ్చు. పైగా ఈ నాలుగు చోట్ల వైసీపీ నేతలు పెద్దగా బలపడలేదు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన కూడా తూర్పు గోదావరిలో ఉన్న ఈ నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం ఖాయమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికైతే తూర్పు టీడీపీ ఎమ్మెల్యేలకు తిరుగులేదనే చెప్పొచ్చు.
Discussion about this post