ఏపీలో తెలుగుదేశం నాయకుల్లో ధైర్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిదానంగా నాయకులు బయటకొస్తూ, అధికార వైసీపీకి ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో చాలామంది నాయకులు అడ్రెస్ లేకుండా పోయారు. కొందరు ఏమో పార్టీ మారిపోయారు. మరికొందరు ఏమో సైలెంట్ అయిపోయారు. అయితే వైసీపీ ఎక్కడకక్కడ టీడీపీ నేతలని టార్గెట్ చేసి ఆర్ధికంగా దెబ్బకొట్టడం, కేసులు పెట్టి, జైల్లో పెట్టించడం చేయడంతో, కొందరు నాయకులు బయటకొచ్చి పోరాడటానికి వెనుకడుగు వేశారు.

ఏదో చంద్రబాబుతో పాటు నలుగురైదుగురు నేతలు మాత్రమే, ప్రజల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతూ ఉండేవారు. అయితే జగన్ ప్రభుత్వం…ఊహించని విధంగా టీడీపీలో ఉన్న బలమైన నాయకులని, పోరాడే వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టించింది. ఇక జైలు నుంచి బయటకొచ్చాక ఆ నాయకులు మరింత బలపడ్డారే తప్ప, వీక్ కాలేదు. పైగా అధినేత చంద్రబాబు, లోకేష్‌ల సపోర్ట్ పెరగడంతో, ఆ నాయకులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే సైలెంట్ అయిపోయిన నాయకులు సైతం ఇప్పుడు స్లోగా బయటకొచ్చి, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం మొదలుపెడుతున్నారు. ఇక తాజాగా దేవినేని ఉమా, నారా లోకేష్‌లు సైతం అరెస్ట్ కావడంతో టీడీపీ నేతలు మరింతగా ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. ఇక లోకేష్‌ని అరెస్ట్ చేసిన సమయంలో టీడీపీ నాయకుల్లో ఐకమత్యం కూడా పెరిగి, పోరాటం మొదలుపెట్టారు. అసలు లోకేష్‌ని పోలీసులు తీసుకెళ్లే రోజు, టీడీపీ నేతలు ఏ రేంజ్‌లో లోకేష్‌కు అండగా నిలబడ్డారో చెప్పాల్సిన పనిలేదు.

ఇలా ధైర్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎదురుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. సర్కార్‌కు ఈ దూకుడు కాస్త ఇబ్బందిగానే ఉంది. అయితే మరికొందరు నేతలు కూడా బయటకు రావాల్సి ఉంది. వారు కూడా బయటకొస్తే, టీడీపీ బలం మరింత పెరుగుతుంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి పుంజుకునే అవకాశాలున్నాయి.
Discussion about this post