ఇటీవల టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు…జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, చంద్రబాబు ఇంటి దగ్గర హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రతిపక్ష నాయకుడు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఇంటికి జోగి ఒక 20 కార్లు వేసుకుని తన అనుచరులతో వచ్చి హల్చల్ చేశారు. పైగా అక్కడ కర్రలు, రాళ్ళతో టిడిపి కార్యకర్తలపై దాడికి దిగారు. అటు టిడిపి కార్యకర్తలు కూడా ప్రతిఘటించడంతో అక్కడ పెద్ద రచ్చ అయింది.

అయితే ఇంత రచ్చ అయినా కూడా పోలీసులు దీన్ని చిన్న కొట్లాటగా కొట్టి పారేయడం వింతగా ఉందని టిడిపి శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. పైగా ఆ రోజు జోగి, బాబుతో మాట్లాడటానికి వచ్చారని, బాబు ఇంటికి 300 మీటర్ల దూరంలోనే ఉన్నారని, ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వాహనాలపై దాడి జరిగిందని డీఐజీ చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగారనే తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సబబు కాదని డీఐజీ మాట్లాడుతున్నారని, దానికి తోడు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును పగులకొట్టడం, చెప్పుతో కొట్టడంతోపాటు డ్రైవర్‌ను కూడా చెప్పుతో కొట్టేందుకు టీడీపీ వారు ప్రయత్నించారని, వీటన్నింటిపైనా కేసులు నమోదు చేశామని డీఐజీ తెలపడం చూస్తుంటే, ఆయనకు నిజాలు ఎంత బాగా తెలిసాయో అర్ధమవుతుందని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.
పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారని తెలుసు గానీ, మరీ ఇంత వన్‌సైడ్‌గా ఉంటారని తెలియదని అంటున్నారు.

అయినా ఎమ్మెల్యే, బాబు ఇంటి వైపుకు ఎందుకు వచ్చారు? అన్నీ కార్లలో ఎందుకు వచ్చారు? ముందే వస్తామని జోగి మీడియా, సోషల్ మీడియాలో చెప్పిన కూడా పోలీసులకు ఎందుకు తెలియలేదు? అసలు బాబుతో మాట్లాడటానికే జోగి వచ్చారా? అని తమ్ముళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నారు. అక్కడ రచ్చ చేసిందే జోగి, ఆయన అనుచరులైతే పోలీసులు..టిడిపి నేతలు, కార్యకర్తలు మీద కేసులు పెట్టడం పెద్ద వింత అని అంటున్నారు.

Discussion about this post