May 28, 2023
ap news latest AP Politics

నరసాపురంలో ట్విస్ట్‌లు..ఆ రాజుల పొజిషన్ ఏంటి?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న ప్రాంతాల్లో నరసాపురం పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టి‌డి‌పి అదిరిపోయే విజయాలనే సొంతం చేసుకుంది. 1984, 1989, 1991, 19996 ఎన్నికల్లో టి‌డి‌పి సత్తా చాటింది. 1999 ఎన్నికల్లో టి‌డి‌పి సపోర్ట్ తో బి‌జే‌పి గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టి‌డి‌పితో పొత్తులో భాగంగా అక్కడ బి‌జే‌పి గెలిచింది.

ఇక 2019 ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టి‌డి‌పి నుంచి పోటీ చేయాల్సిన రఘురామకృష్ణంరాజు..వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశారు. దీంతో ఉండి నియోజకవర్గంలో ఉన్న వేటుకూరి శివరామరాజుని టి‌డి‌పి నుంచి బరిలో దింపారు. అటు జనసేన నుంచి నాగబాబు పోటీ చేశారు. అయితే హోరాహోరీగా జరిగిన పోరులో రఘురామ 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసేన ఓట్ల చీలిక ప్రభావం టి‌డి‌పిపై బాగా పడింది.

అయితే వైసీపీ నుంచి గెలిచిన రఘురామ..ఆ తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా మారిన విషయం తెలిసిందే. వైసీపీపై ఆయన ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే. ఇక ఈయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నరసాపురంలో పోటీ చేసి వైసీపీని ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. పైగా టి‌డి‌పి-జనసేన పొత్తు లో పోటీ చేస్తానని అంటున్నారు. ఇక పొత్తు ఇంకా ఫిక్స్ కాలేదు…ఎన్నికల ముందు పొత్తు తేలే ఛాన్స్ ఉంది.

అయితే పొత్తు ఉంటే నరసాపురం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. ఇక ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో టి‌డి‌పి నుంచి శివరరామరాజు పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఆయన మళ్ళీ తన సొంత స్థానం ఉండి వెళ్లాలని చూస్తున్నారు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు. చూడాలి మరి ఈ రాజులకు సీట్లు ఎలా ఫిక్స్ చేస్తారో.