ఫీజు రీయింబర్స్మెంట్ ఆనాడు దివంగత వైఎస్సార్ తీసుకొచ్చిన గొప్ప పథకమని చాలామంది భావిస్తారు. అయితే ప్రతి పేదవాడు ఉచితంగా పై చదువులు చదవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ దీని వల్ల లాభం ఎంత జరిగిందో తెలియదుగానీ, నష్టం మాత్రం బాగానే జరిగింది. 2004 ముందువరకు ఉమ్మడి ఏపీని చంద్రబాబు పాలించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు సరిపడ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉండేవి. అలాగే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందేది.
ఇక ఇంజినీరిగ్, మెడిసిన్ పూర్తయి బయటకొచ్చిన ప్రతి విద్యార్ధికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చేవి. కానీ ఎప్పుడైతే వైఎస్సార్ అధికారంలోకి రావడం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారో అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. ఈ పథకంలో పుట్టగొడుగుల్లా ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చేశాయి. విద్య పూర్తిగా వ్యాపారమైపోయింది. పెద్ద ఎత్తున విద్యార్ధులు ఇంజినీరింగ్, ఎంసిఏ, ఎంబిఏ, మెడిసిన్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. అయితే విద్యార్ధులు పై చదవులు చదవటం వల్ల నష్టమేమీ లేదు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల కాలేజీల్లో నాణ్యమైన విద్య దొరకలేదు.
నాణ్యమైన బోధన సిబ్బంది లేక, విద్యార్ధులు చాలా నష్టపోయారు. సరైన స్కిల్స్ వాళ్ళకు రాలేదు. ఫలితంగా ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులు చాలా వరకు ఉద్యోగాలు సాధించడంలో విఫలమయ్యారు. స్కిల్స్ లేక ఇంటర్వ్యూల్లోనే ఫెయిల్ అయ్యారు. అటు అరకొర చదవులు చదివి డాక్టర్ పట్టా పట్టుకుని తిరిగే పరిస్తితి వచ్చింది. పైగా ప్రతి ఏటా లక్షల్లో విద్యార్ధులు పాస్ అయ్యి బయటకొస్తే, వారికి కనీసం ఉద్యోగాలు కల్పించడంలో నాడు వైఎస్సార్ ప్రభుత్వం విఫలమైంది.
రాష్ట్రం విడిపోయాక ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. దీంతో నిరుద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు, పలు కంపెనీలని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించే కార్యక్రమం చేశారు. కానీ ఐదేళ్లలో ప్రజలు చంద్రబాబుని గద్దె దించి జగన్‌ని సీఎం చేశారు. దీంతో నిరుద్యోగుల పరిస్తితి మళ్ళీ మొదటకొచ్చింది. కొత్త కంపెనీలు తీసుకొచ్చి, ఉద్యోగాలు ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఏదో 5 వేలు ఇచ్చి వాలంటీర్లు అని చెప్పి గ్రామాల్లోనే పని చేసుకునేలా చేశారు. అటు ప్రభుత్వ ఉద్యోగాలని సైతం భర్తీ చేయడంలో జగన్ విఫలమయ్యారు. మొత్తానికైతే నాడు వైఎస్సార్, నేడు జగన్‌లు నిరుద్యోగుల పాలిట శాపంగా మారారనే చెప్పొచ్చు.
Discussion about this post