ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటం వల్ల, ఆ పార్టీకి చెందిన నేతలు గానీ, కార్యకర్తలు గానీ ఏ స్థాయిలో ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలపై మాటల దాడితో పాటు భౌతికపరమైన దాడులు జరుగుతున్నాయి. ఇంకా జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపితే వారిపై కేసులు పెట్టేస్తున్నారు.సోషల్ మీడియా, యూట్యూబ్‌ల్లో ఒక్క మాట జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా కేసులు పెడుతున్నారు. కానీ అంతకంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళని దూషిస్తే అసలు కేసులు ఉండవు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే కొందరు వైసీపీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఇష్టారాజ్యంగా చంద్రబాబు, లోకేష్‌లపై అసభ్య పదజాలంతో దూషిస్తారు. అలాంటివారికి వైసీపీ పార్టీకి అండగా ఉంటుందని టీడీపీ శ్రేణులు గట్టిగానే చెబుతున్నాయి.
అదే టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు ఒక్క విమర్శ చేస్తే, ఏపీ, తెలంగాణల్లో వారికి చెందిన కుటుంబాలని వైసీపీ ప్రభుత్వం హింసిస్తుందని చెబుతున్నారు. కానీ వైసీపీ ఎన్‌ఆర్‌ఐలు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ముఖ్యంలో అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ అనే ఒక వ్యక్తి, పంచ్ ప్రభాకర్ పేరిట యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. అసభ్య పదజాలం వాడుతూ దూషిస్తారు.అతనికి వైసీపీ ప్రభుత్వం మద్ధతుగా ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అలా టీడీపీపై విరుచుకుపడే పంచ్ ప్రభాకర్‌కు తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రులు నీటి విషయంలో జగన్, వైఎస్సార్‌లపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో జగన్, వైఎస్సార్‌లపై విమర్శలు చేశారు.ఇక శ్రీనివాస్ గౌడ్‌పై పంచ్ ప్రభాకర్ దారుణమైన విమర్శలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ కులాన్ని కించపరుస్తూ వీడియో చేసి పెట్టారు. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన పంచ్ ప్రభాకర్ యూఎస్ నుంచి యూట్యూబ్ చానెల్, ఫేస్‌బుక్ పేజీలను ఆపరేట్ చేస్తూ మంత్రిపై అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలంగాణ సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు అయింది.
అలాగే ప్రభాకర్ మాట్లాడిన మాటలని సీడీల రూపంలో ఆధారాలు పోలీసులకు సమర్పించారు. కులం, గౌరవాన్ని కించపరిచే భాషలో మాట్లాడుతూ మంత్రి పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తెలంగాణ పోలీసులు ఈ విషయంలో ప్రభాకర్‌కు గట్టిగానే పంచ్ ఇస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
Discussion about this post