ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే, పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చిన పయ్యావుల ఇప్పుడు పిఏసి ఛైర్మన్‌గా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసపెట్టి ఏపీ ప్రభుత్వం ఆర్ధికపరమైన అంశాల్లో అవకతవకలకు పాల్పడిన విషయాలని బయట పెడుతున్నారు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బుగ్గనకు చుక్కలు చూపిస్తున్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలాంటి బిల్లులు, రశీదులు లేకుండా 41 వేల కోట్లు చెల్లింపులు చేసుకుందని పయ్యావుల ఆరోపించారు. అయితే దీనికి గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ వల్లే ఇబ్బందులు వచ్చాయని, అన్నిటికి లెక్కలు ఉన్నాయని బుగ్గన తేలికగా చెప్పేశారు. మరి ఎప్పటినుంచో ఇబ్బందులు ఉంటే, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని పయ్యావుల కౌంటర్ ఇచ్చేశారు.అలాగే మరో 25 వేల కోట్ల రుణాలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవని పయ్యావుల మరో పాయింట్ లేవనెత్తారు. ఇంకా 17 వేల కోట్ల రుణాలని పరిమితికి మించి తీసుకున్నారని పయ్యావుల ఆరోపించారు. అయితే వీటిపై బుగ్గన సరైన సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పైగా తప్పు చేసిందే కాక, వాటిని సమర్ధించుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని, టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.అసలు బుగ్గన అన్నిటికి లెక్కలు చూపించిన టీడీపీ నేతలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు కవర్ చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్తితులని చూస్తే పయ్యావుల అడిగే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక, బుగ్గన ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, కవర్ చేసుకుంటున్నారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అయితే పయ్యావుల గ్యాప్ ఇవ్వకుండా బుగ్గనని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌డీసీ) వివిధ బ్యాంకుల నుంచి ఏమైనా రుణాలు పొందితే, వాటి వివరాలని ఇవ్వాలని కోరారు. మొత్తానికైతే పిఏసి ఛైర్మన్‌గా పయ్యావుల దూకుడు ప్రదర్శిస్తున్నారు.
Discussion about this post