ఇంతకాలం లేనిది ఒక్కసారిగా వైసీపీ ఎంపీలు, పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై ఆందోళన చేయడం మొదలుపెట్టారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని చెప్పి, హోదా విషయంలో కేంద్రాన్ని ప్లీజ్, ప్లీజ్ అని అడగటం తప్ప ఏం చేయలేమని, కేంద్రం మెడలు వంచడం కూడా సాధ్యం కాదని మొదట్లోనే జగన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
ఇక గత రెండేళ్లుగా కేంద్రం మెడలు వంచడం పక్కనబెడితే, వైసీపీ ప్రభుత్వమే కేంద్రం దగ్గర దగ్గర బెండ్ అవుతుందనే విమర్శలు తెచ్చుకుంది. అలాంటిది వ్యూహాత్మకంగా పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై వైసీపీ రచ్చ మొదలుపెట్టింది. విజయసాయి రెడ్డి అయితే ఏకంగా హోదాపై చర్చ పెట్టాలని, రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. అప్పటికే పలు అంశాలపై చర్చించాల్సి ఉండటంతో ఛైర్మన్ ఆ నోటీసు తిరస్కరించారు. దీంతో విజయసాయిరెడ్డి, తన తోటి వైసీపీ ఎంపీలు రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలియజేశారు.అటు లోక్‌సభలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే లోక్‌సభ ఎంపీలు పోలవరంపై చర్చ పెట్టాలని చెప్పి, ఆందోళన చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా, కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయిపోయారు. అయితే ఇంత హఠాత్తుగా వైసీపీ ఎంపీలు నిరసనలకు దిగడానికి కారణం లేకపోలేదు. ఆల్రెడీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలపై లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. దీనిపై చర్చిండానికి లోక్‌సభ అంగీకరించింది. ఈ క్రమంలోనే విజయసాయి హడావిడిగా నోటీసు ఇచ్చారని తెలుస్తోంది.
ఇక ఏ విషయంలోనైనా రామ్మోహన్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలిసిందే. దీంతో రామ్మోహన్ కంటే ముందే వైసీపీ ఎంపీలు హడావిడి చేశారని తెలుస్తోంది. అది కూడా ప్రధాని మోదీ ఉండగానే, విజయసాయి నిరసనకు దిగి, అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఏదేమైనా ప్రజల్లో వ్యతిరేకిత మొదలువుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు కాస్త హడావిడి చేసినట్లు కనిపిస్తోంది.
Discussion about this post