గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఆధిక్యం తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వైసీపీ లీడ్ పడిపోతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైసీపీ హవా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఆధిక్యం చాలా వరకు తగ్గిందని తెలుస్తోంది. అత్యధికంగా వైసీపీ లీడ్ తగ్గిన జిల్లా ఇదే అని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలా వైసీపీ హవా నడిచింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. జిల్లాలో టీడీపీ బలం పెరుగుతుంది. టీడీపీకి ఉన్న సిట్టింగ్ సీట్లు పాలకొల్లు, ఉండిలో బలంగానే ఉంది. ఇక వైసీపీ చేతుల్లో ఉన్న 13 సీట్లలో టీడీపీ కొన్ని సీట్లలో లీడ్ లోకి వచ్చిందని తెలుస్తోంది. వైసీపీ గెలుచుకున్న సీట్లలో తణుకు, ఆచంట, దెందులూరు, ఉంగుటూరు లాంటి సీట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో జనసేనతో గాని పొత్తు ఉంటే ఏలూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు సీట్లలో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ లేదా జనసేన ఆ సీట్లలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇటు పోలవరం, చింతలపూడి, కొవ్వూరు, గోపాలాపురం లాంటి రిజర్వడ్ సీట్లలోనే వైసీపీకి బలం కనిపిస్తుంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు కొవ్వూరు, గోపాలాపురం సీట్లలో ఉండవచ్చు. మొత్తానికి పశ్చిమ లో వైసీపీ ఆధిక్యం భారీగా తగ్గేలా ఉంది.
