పామర్రు..పేరుకు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ..కానీ అక్కడ టీడీపీ ఎప్పుడు వెనుకబడే ఉంటుంది. ఇంతవరకు అక్కడ టిడిపి గెలిచిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం పామర్రు నియోజకవర్గంలో ఉంటుంది. అయితే 2008లో కొత్తగా ఏర్పడిన ఈ స్థానంలో ఇంతవరకు టిడిపి గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

అయితే 2014లో టిడిపి గెలుపు దగ్గర వరకు వచ్చి ఓడింది. కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన టిడిపిలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆమె టిడిపి నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ గెలిచారు. ఇక ఓడిపోయాక కల్పన పార్టీలో యాక్టివ్ గా లేరు. దీంతో చంద్రబాబు కొన్ని రోజులు చూసి..కల్పనని పక్కన పెట్టి వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాని ఇంచార్జ్ గా పెట్టారు.

ఇంచార్జ్ గా వచ్చాక కుమార్ రాజా కాస్త దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత టిడిపికి కలిసొస్తుంది. దీంతో పామర్రులో టిడిపి కొంతమేర బలపడింది. కానీ ఇప్పటికీ అక్కడ టిడిపికి ఆధిక్యం రాలేదని తెలిసింది టిడిపి అంతర్గత సర్వేల్లో సుమారు..10 వేల ఓట్ల లోటులోనే టిడిపి ఉందట. అంటే వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది.

అయితే కుమార్ రాజా ఇంకా కష్టపడాలి. ప్రధానంగా ఎస్సీ ఓటర్లని ఎక్కువ ఆకర్షించాలి. కాకపోతే వర్ల ఆర్ధికంగా కార్యకర్తలపై ఆధారపడుతున్నారు. ఏ వూరులో కార్యక్రమం ఉంటే ఆ వూరులో ఉన్న టిడిపి కార్యకర్తల చేత ఖర్చు పెట్టేస్తున్నారనే టాక్ ఉంది. దీని వల్ల కొందరు అసంతృప్తిగా ఉంటున్నారు. కాస్త ఆర్ధికంగా అండగా నిలబడితే కార్యకర్తలు ఇంకా దూకుడుగా ఉంటారు. కాబట్టి కుమార్ రాజా ఎంత కష్టపడితే..అంతగా పార్టీకి మైలేజ్. చూడాలి మరి ఈ సారైనా పామర్రులో టిడిపి గెలుస్తుందో లేదో.
