ప్రశాంత్ కిశోర్.. ఉరఫ్ పీకే.. ఏపీలోనే కాదు.. దేశంలోని రాజకీయాల్లో ఈయన పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు పీకే ఎంతో కష్టపడ్డారు. ఇక, అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. మరీముఖ్యంగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. జగన్‌ను సీఎం పీఠం ఎక్కించడంలో పీకే సక్సెస్ అవడంతో దేశవ్యాప్తంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత.. బిహార్‌లో నితీష్ కుమార్‌ను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత కూడా పీకేకే దక్కుతుంది.

అదేసమయంలో అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్‌లోనూ దీదీ.. మమతాబెనర్జీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంతోనూ పీకే వ్యూహాలు కలిసి వచ్చాయి.ఈ క్రమంలో మళ్లీ ఏపీలోని జగన్ సర్కారుతో ఆయన కలిసి పనిచేయడం ఖాయమని ఇటీవల వరకు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల కిందట.. పీకే.. నేరుగా తాడేపల్లికి వచ్చి.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీనిని గమనించిన వారు.. పీకే వ్యూహంతో మళ్లీ జగన్ ఎన్నికలకు వెళ్తారని.. అన్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు పీకేతో జగన్‌కు విభేదాలు వచ్చాయని అంటున్నారు పరిశీలకులు.

ప్రస్తుతం పీకే విషయం జగన్ అంతర్మథనంలో పడ్డారని.. వైసీపీ సీనియర్ల నుంచి గుసగుస వినిపిస్తోంది. ఇటీవల .. పీకే స్వయంగా ఫోన్ చేసినా.. జగన్ స్పందించలేదని.. తర్వాత మాట్లాడతారని.. చెప్పించారని .. ఇక, ఆ తర్వాత.. కూడా జగన్ పీకేతో మాట్లాడలేదని.. సమాచారం. అయితే.. దీనికి కారణం ఏంటి? అనే చర్చ కూడా అదేసమయంలో తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో జగన్ సోదరి షర్మిల వైఎస్సా ర్ టీపీని పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ఆమె దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో నే షర్మిల కూడా పీకేను తన పార్టీకి వ్యూహకర్తగా నియమించుకున్నారు.

వచ్చే నెల 1 నుంచి పీకే.. వ్యూహాలతోనే షర్మిల రాజకీయాలు చేయనున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య భారీ డీల్ కుదిరిందని.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే.. వాస్తవానికి అసలు షర్మిల పార్టీ పెట్టడమే ఇష్టం లేని.. జగన్.. ఇప్పుడు తన వ్యూహకర్త.. తెలంగాణలో పనిచేయడం.. అందు నా.. షర్మిలకే వ్యూహకర్తగా ఉండడాన్ని.. జీర్ణించుకోలేక పోతున్నారని.. ఇది తనకు-టీ సీఎం కేసీఆర్‌కు మధ్య ఉన్న సున్నిత సంబంధాలపై ప్రభావం చూపుతుందని.. జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలో పీకే విషయంలో తాను కట్ చేసుకోవడమే బెటర్ అని భావిస్తున్నారని.. వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఇది నిజమేనా? కాదా? అనేది చూడాలి.

Discussion about this post