ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి స్థానాల్లో పుట్టపర్తి, పెనుకొండ స్థానాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ స్థానాల్లో టిడిపి మెజారిటీ సార్లు గెలిచింది. 2014లో సైతం ఈ రెండు స్థానాల్లో టిడిపి జెండా ఎగిరింది. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి, పెనుకొండలో బీకే పార్థసారథి గెలిచారు. ఇద్దరు సీనియర్ నేతలే. ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు.
కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఇద్దరు నేతలు ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయలేదు. తర్వాత నిదానంగా ఎంట్రీ ఇచ్చి పనిచేస్తున్నారు. అంతా బాగానే ఉంది..కాకపోతే అక్కడ వేరే నేతలు కూడా రావడం..ఇద్దరు సీనియర్లకు ఇబ్బందిగా మారింది. సీటు విషయంలో కన్ఫ్యూజన్ వచ్చింది. పెనుకొండలో పార్థసారథికి పోటీగా సవితమ్మ ఉన్నారు. ఈమె సైతం సీటు ఆశిస్తున్నారు. పెనుకొండలో ఎక్కువ తిరుగుతున్నారు. పార్టీకి అండగా నిలబడుతున్నారు. దీంతో సీటు ఇవ్వాలని ఆమె వర్గం పట్టుబడుతుంది. ఇటు సారథి వర్గం సైతం సీటు కోసం కష్టపడుతుంది. ఇలా రెండు వర్గాల మధ్య సీటు విషయంలో పోటీ ఉంది.

కానీ ఎవరికి సీటు ఇవ్వాలనే అంశం మాత్రం తేలలేదు. బాబు ఆలోచన ఎలా ఉందో క్లారిటీ లేదు. ఇటు పుట్టపర్తిలో అదే పరిస్తితి. పుట్టపర్తి టీడీపీలో పోరు ఎక్కువ ఉంది. ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డికి..జేసీ బ్రదర్స్ చెక్ పెట్టాలని చూస్తున్నారు. తమ వర్గం నేతకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.
అదే విధంగా ఓ బీసీ నేత సైతం పుట్టపర్తి సీటు ఆశిస్తున్నారు. ఇలా సీటు విషయం లో పోటీ నెలకొంది. ఇటు పల్లెకు వయసు మీద పడుతుంది. దీంతో ఈ సీటు విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పల్లె, బీకేలకు సీటు విషయంలో క్లారిటీ రాలేదు.