చింతకాయల అయ్యన్నపాత్రుడు….తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్న…పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా కోసం పని చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు పార్టీ కోసమే పనిచేశారు. మధ్యలో ఎంతమంది నాయకులు వస్తూ, పోతూ ఉన్నా సరే అయ్యన్న ఎప్పుడు పార్టీని వదల్లేదు. ఇలా పార్టీ కోసం నిత్యం కష్టపడుతున్న అయ్యన్న..తన సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టినట్లు కనిపిస్తోంది.

మామూలుగానే నర్సీపట్నం, అయ్యనకు కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు అయ్యన్న ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. డైరక్టర్ పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేశ్ చేతిలో అయ్యన్న ఓడిపోయారు. అయితే ఓడిపోయినా సరే మిగతా టీడీపీ నాయకులు మాదిరిగా సైలెంట్ అవ్వకుండా నిత్యం పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు.

విశాఖలో అధికార వైసీపీ చేసే అక్రమాలని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వైసీపీ మూడు రాజధానుల పేరుతో రాజకీయంగా దెబ్బకొట్టాలని చూసిన కూడా ఎదురునిలబడి, అమరావతికి మద్ధతుగా నిలబడ్డారు. ఇలా అన్నీ రకాలుగా పార్టీకి అండగా ఉంటూ, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న అయ్యన్న, నర్సీపట్నంలో బాగా పికప్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నర్సీపట్నంలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు.

అటు వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్‌పై కూడా నియోజకవర్గంలో వ్యతిరేకిత పెరుగుతుంది. ప్రభుత్వ పథకాలు మినహా, నియోజకవర్గానికి కొత్తగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు. పైగా వైసీపీ వల్ల ప్రజలు ఆర్ధికంగా బాగా నష్టపోతున్నారు. ఈ పరిణామాల క్రమంలో నర్సీపట్నంలో పూరీ సోదరుడుపై వ్యతిరేకిత పెరిగిపోయింది. అలాగే అయ్యన్న బాగా పుంజుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పూరీ తమ్ముడుకు అయ్యన్న చుక్కలు చూపించేలా ఉన్నారు.
Discussion about this post