తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తుండటం తో కొన్ని వర్గాల్లో అక్కడ హాట్ హాట్ టాపిక్ నడుస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల పార్టీ తెలంగాణ లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది ? అన్నదానిపై కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అన్న జగన్మోహన్ రెడ్డి కోసం ఆరేళ్లుగా ఎంతో కష్టపడిన షర్మిల పాదయాత్ర కూడా చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు నాడు వైసీపీ కార్యకలాపాలు అన్ని ఆమే చూసుకున్నారు.
2014 – 2019 ఎన్నికల్లో రెండుసార్లు ఆమె వైసీపీ తరఫున కడప – ఒంగోలు – ఖమ్మం నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. కారణాలు ఏవైనా అన్న చెల్లికి సీటు ఇవ్వలేదు. చివరకు ఇద్దరి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో గాని షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించడం తోపాటు 2023 ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే షర్మిల బీజేపీని టార్గెట్ గా చేసుకుని కూడా విమర్శలు చేస్తున్నారు.ఈ విమర్శలపై ప్రముఖ యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి స్పందించారు. షర్మిల కేసీఆర్‌కు – బండి సంజయ్‌కు డీల్ కుదిరిందని ఎలా ? అంటారని ఫైర్ అయ్యారు. షర్మిలకు పార్టీ పెట్టాక తెలంగాణ గుర్తుకు వచ్చిందని.. సంజయ్ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారని శ్వేత అన్నారు. బండి సంజయ్ ఏ సమస్య ఉన్నా కూడా పోరాటాలు చేస్తారని.. షర్మిలే కేసీఆర్ తో డీల్ కుదుర్చుకున్నారంటూ శ్వేతా రెడ్డి తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తో డీల్ కుదుర్చుకునే అవసరం సంజయ్ కు లేదని.. ఆయనకు ముందు విడాకులు తీసుకుని.. తర్వాత ప్రేమించు కోవడాలు… ఆ తర్వాత లోపల కాపురాలు చేయడాలు కుదరవని కేసీఆర్ మెడలు వంచే నిఖార్సు అయిన నాయకుడు ఆయనే అంటూ షర్మిలను ఆడేసుకుంది.
Discussion about this post