రాజకీయాల్లో పొత్తులు అనేవి సహజమే…పార్టీలు అధికారంలోకి రావడం కోసం..తమ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ వస్తాయి. అయితే ఈ పొత్తులు ఒకోసారి సక్సెస్ కావొచ్చు, ఒకోసారి ఫెయిల్ కావొచ్చు. ఈ పొత్తుల రాజకీయం టీడీపీ అధినేత చంద్రబాబు చాలాసార్లు నడిపారు. అప్పటికప్పుడు ఉండే రాజకీయ పరిస్తితిని బట్టి చంద్రబాబు, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు. ఈ పొత్తుల వల్ల ఒకసారి సక్సెస్ అయ్యి అధికారంలోకి రాగా, మరొకసారి ఫెయిల్ అధికారానికి దూరమయ్యారు.

అలా అని ఒంటరిగా పోటీ చేసి కూడా 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు..బిజేపి, జనసేనలతో పొత్తు పెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓడిపోయాక చంద్రబాబు..మళ్ళీ బిజేపి, జనసేనలతో పొత్తు పెట్టుకోవడం కోసం పాకులాడుతున్నారని, పొత్తులు లేనిదే చంద్రబాబు ఉండలేరు అంటూ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఇంతవరకు చంద్రబాబు పొత్తులపై అసలు స్పందించలేదు. కానీ వైసీపీ నాయకులే చంద్రబాబు పొత్తులు లేనిదే ఉండలేరంటూ ఎద్దేవా చేస్తూ వచ్చారు. అటు బిజేపి నేతలు సైతం మళ్ళీ చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని హడావిడి చేస్తున్నారు. అసలు చంద్రబాబు, బిజేపితో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించిన సందర్భం ఏమి లేదు. కానీ బిజేపి నేతలు వారిని వారు ఎక్కువగా ఊహించుకుని హడావిడి చేశారు.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బాబు పొత్తు పెట్టుకుంటారా? అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. కానీ టీడీపీలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటుదామనే మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం ఒక్క జనసేనతో పొత్తు పెట్టుకుంటే బెటర్ అని, అప్పుడు ఓట్లు చీలిపోకుండా ఉంటాయని చెబుతున్నారు. అసలు బిజేపితో మాత్రం మళ్ళీ కలవొద్దని అంటున్నారు. మరి ఈ పొత్తుల విషయంలో చంద్రబాబు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Discussion about this post