పోలవరం….ఆంధ్రప్రదేశ్ జీవనాడి…ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రం సశ్యామలం అవుతుంది. సాగునీరు, తాగునీరు సమస్యలు కూడా ఉండవు. కానీ ఈ ప్రాజెక్టు ఇప్పటిలో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన చేస్తోంది. అసలు ఎప్పుడో పోలవరానికి పునాది పడింది. కానీ ఈ ప్రాజెక్టుకు ఒక రూపు వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వంలో పోలవరం పనులు వేగంగా జరిగాయి. చంద్రబాబు వల్లే తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలని కూడా ఏపీలో కలిపారు. అలాగే ప్రతి సోమవారం…పోలవరం పేరిట చంద్రబాబు ప్రాజెక్టు పనులు పరుగులెత్తించారు.

కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్, పోలవరం ప్రాజెక్టు పనులని వేగంగా చేస్తున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా నిర్వాసితులకు న్యాయం చేయకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఈ అంశాన్ని ఇంతవరకు ప్రతిపక్ష టిడిపి కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా మాత్రం నారా లోకేష్, పోలవరం ముంపు మండలాల్లో పర్యటిస్తూ, బాధితులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే గతంలో నిర్వాసితులని ఆదుకుంటామని చెప్పి జగన్ మోసం చేశారని మాట్లాడుతున్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదని, అటు 25 వసతులతో పునరావాస కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చి, దాన్ని నెరవేర్చలేదని, ఇలా అన్నిరకాలుగా నిర్వాసితులని మోసం చేస్తున్నారని లోకేష్ ఫైర్ అవుతున్నారు. జగన్ ఇచ్చిన హామీలని మెడలు వచ్చుకుని సాధించుకుందామని లోకేష్, నిర్వాసితులకు పిలుపునిస్తున్నారు.

అయితే ఇంతవరకు ముంపు మండలాల్లో వైసీపీ నాయకులు పర్యటించిన దాఖలాలు లేవు. పైగా వారికి న్యాయం చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో ముంపు మండలాల ప్రజలు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పైగా ముంపు ప్రాంత ప్రజలకు న్యాయం చేయకుండా, పోలవరం కడితే ఇబ్బందులు వస్తాయి…ఆ విషయం ఆంధ్రా ప్రజలకు అర్ధమవుతుంది. మొత్తానికి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోకేష్ క్లియర్‌గా హైలైట్ చేసినట్లే కనిపిస్తోంది.

Discussion about this post