ఆయన సాకు చెప్పి తప్పించుకునే నాయకుడు కాదు. కారు డోర్ తీస్తే తప్ప.. కాలు బయట పెట్టని నేత అంతకంటే కాదు. తన పనితాను చేసుకునిపోతూ.. తన పరిధి, తన పద్దతిని కాపాడుకుంటూ.. ప్రజలకు చేరువ అయిన నాయకుడు. ఆయనే.. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. అసలు ఈయన ఎంపికే అనూహ్యం. టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఈయనను ఎంపిక చేయాలనే థాటే గ్రేట్ అంటారు.. టీడీపీ సీనియర్లు. ఎందుకంటే.. అప్పటి వరకు నమ్మకంగా ఉన్న పరుచూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ అనూహ్యంగా పార్టీ కాడిని వదిలేయడంతో.. అప్పటి వరకు ఓ సాధారణ కార్యకర్తగా ఉన్న ఏలూరిని చంద్రబాబు ఎంపిక చేశారు.

నిజానికి అప్పటికి `ఆపద్ధర్మం` అన్నట్టుగా ఏలూరిని ఎంపిక చేశారనే వాదన ఉంది. అయితే.. తనను ఎంపిక చేసిన.. చంద్రబాబు పేరు నిలపాలని అనుకున్నారో.. లేక.. తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారో.. ఏదేమైనా.. ఏలూరి.. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇదే.. ఆయనను బలమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోటరినీ ఛేదించి.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కేలా చేయడమే కాకుండా.. తనకంటూ.. ప్రత్యేకతను నిలుపుకొనేలా చేసింది. అంతేకాదు.. `దటీజ్ ఏలూరి` అనే నినాదం నలుదిశలా వినిపించేలా చేసింది. 2014లో పరుచూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఏలూరి.. తర్వాత పరిణామాల్లో ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు.

దశాబ్దాలుగా వెనుకబడిన పనులు పూర్తి చేయడంలోను, సాగు, తాగు నీటి ప్రాజెక్టులపై దృస్టి పెట్టడంలోను.. ఆయన వ్యూహాత్మ కంగా అడుగులు వేశారు. వ్యక్తిగతంగా ఆయన వ్యవసాయదారు కుటుంబం నుంచి రావడం.. నియోజకవర్గంలోని రైతులకు మేలిమి వరంగా మారింది. నిత్యం వారి సమస్యలను పరిష్కరించడం.. ఆయన విధిగా మారిపోయింది. ఎక్కడికక్కడ టీడీపీ కార్యాలయాలను ఏర్పాటు చేసి.. వాటినే సమస్యల పరిష్కార కేంద్రాలుగా మార్చేశారు. అదేసమయంలో నాణ్యమైన విత్తనాలు.. ఎరువులను రైతులకు అందించడంలో ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి.. తక్కువ ధరలకే వాటిని అందించారు. ఇది నిజంగా రైతుల సేవలో ఏలూరికి పెద్ద ఎస్సర్ట్‌గా మారింది.

ఇక, సాధారణ ప్రజల సమస్యలు పరిష్కరించడంలోను, వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు.. ఎలాంటి తరతమ భేదాలు లేకుండా హాజరవడం.. వంటివి.. ప్రజల మనిషిగా ఏలూరిని నిలబెట్టింది. మరోవైపు.. వివాద రహితుడిగా, ఆయన గుర్తింపు పొందారు. నిజానికి 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ జోరుగా సాగింది. జగన్‌కు ప్రజలు హారతి పట్టారు. ఈ క్రమంలో టీడీపీ తరఫున పోటీ చేసిన అతిరథమహారథులు కూడా మట్టి కరిచారు. అయినప్పటికీ.. ఏలూరి మాత్రం దిగ్విజయంగా గెలుపు గుర్రం ఎక్కారు. నిజానికి ఇది అంత ఈజీ విజయం కానేకాదు. వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఆయన పాకులాడలేదు.

పనితోనే అన్నీ వస్తాయనే ఏకైక సూత్రాన్ని నమ్మిన నాయకుడిగా.. చంద్రబాబు ఎంపిక ఎప్పటికీ.. తప్పుకాదనే దీక్షతో ప్రజల నేతగా నిత్యం వెలుగొందుతున్నారు ఏలూరి సాంబశివరావు. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ పరుచూరు విజయం ఈయనకే రిజర్వ్ అయిందని అంటారు ఆయన అభిమానులు. కష్టపడేవారికి, మనసున్న వారికి ప్రజలు పట్టం కట్టడంలో ఆశ్చర్యం ఏముంటుంది!!

Discussion about this post