అనంతపురం జిల్లా టీడీపీలో పరిటాల ఫ్యామిలీ మొదట నుంచి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. పరిటాల రవి మరణం తర్వాత సునీతమ్మ రాప్తాడులో టీడీపీని నడిపించారు. అయితే గత ఎన్నికల్లో సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని తనయుడు పరిటాల శ్రీరామ్‌ని బరిలో నిలబెట్టారు. ఇక రాప్తాడు బరిలో నిలబడిన శ్రీరామ్, జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. తొలిసారి ఓటమి పాలైన శ్రీరామ్ మళ్ళీ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీకి ధర్మవరం బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో శ్రీరామ్ అటు రాప్తాడుని చూసుకుంటూనే, ధర్మవరంలో కూడా పార్టీని నడిపిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూనే, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే రాప్తాడులో టీడీపీ పుంజుకున్నట్లే కనిపిస్తున్నా, ధర్మవరంలో మాత్రం కాస్త వెనుకబడే ఉన్నట్లు తెలుస్తోంది.రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌కు అనుకూలంగా పరిస్తితులు మారుతున్నాయి. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకిత, నిత్యం శ్రీరామ్ ప్రజల్లోనే ఉండటం ప్లస్ అవుతుంది. కానీ ధర్మవరంలో మాత్రం పరిస్తితి అలా లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈయన నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అక్కడకక్కడే సమస్యలని పరిష్కరించే కార్యక్రమం చేస్తున్నారు.

అయితే కెమెరా, మైక్‌లు పెట్టుకుని కేతిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని, ఇదంతా అర్ధమైనరోజు కేతిరెడ్డిని ధర్మవరం ప్రజలు తిరస్కరించడం ఖాయమని శ్రీరామ్ అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో ధర్మవరంలో కేతిరెడ్డికే ప్లస్ ఉండగా, శ్రీరామ్‌కు మైనస్ ఉంది. కానీ రాప్తాడులో శ్రీరామ్‌కు ప్లస్ ఉందని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో కూడా శ్రీరామ్ రాప్తాడు నుంచే బరిలో దిగనున్నారని తెలుస్తోంది. మొత్తానికైతే శ్రీరామ్‌కు రాప్తాడులో ప్లస్ ఉంటే, ధర్మవరంలో మైనస్ ఉంది. ధర్మవరంలో పోటీ చేయాలంటే మరింతగా కష్టపడాలి.
Discussion about this post