జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దాదాపు తన పార్టీని విలీనం చేసే సంకేతాలు ఇచ్చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీని నడిపించడం అంత ఈజీకాదని చెప్పేశారు. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు కూడా పార్టీ ఉంటుందనే విషయం సందేహంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. సో.. ఆయన బీజేపీలో పార్టీని విలీనం చేసే ప్రతిపాదనకు బలం చేకూరుతోంది.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. జనసేన పెట్టిన తర్వాత.. చాలా మంది యువత పవన్‌పై ఉన్న నమ్మకంతో రాజకీ యాల్లోకి వచ్చారు. అయితే.. వారంతా.. ఇప్పుడు దిక్కులేకుండా పోతారనే వాదన వినిపిస్తోంది. ఎందుకం టే.. జనసేనను బీజేపీలోకి విలీనం చేయడం .. వందలాదిగా ఉన్న కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. వారు పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు తప్ప.. రెండు పార్టీలూ కలిసి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించకపోవడం గమనార్హం.దీనికి ప్రధానంగా కార్యకర్తల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా ఉంది. ఇప్పుడు బీజేపీతో విలీనం చేస్తే.. మరి వీరిని పవన్ ఏం చేయనున్నారు. ఆయన మాట ప్రకారం బీజేపీలో వెళ్లేందుకు ఆపార్టీని గెలిపించేందుకు ఈ కార్యకర్తలు ఇష్టపడరనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు వైసీపీ వైపు చూస్తున్నారనే వాదన కూడా ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇదే జరిగితే.. పవన్ ఆశలు కూడా నిరాశలవుతాయని అంటున్నారు పరిశీలకులు. ఇక పవన్‌ను నమ్ముకున్న కేడర్ కూడా నట్టేట మునిగినట్టే అవుతుంది.
వైసీపీకి వ్యతిరేకంగానే ఆయన బీజేపీ పంచన చేరుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే..బీజేపీ లేకపోతే.. టీడీపీ అధికారంలోకి రావాలనేది పవన్ నిర్ణయంగా ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల విషయం ఎటు మలుపుతిరుగుతుందోనని జనసేనలో ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం. అయితే.. బీజేపీలో విలీనం అయినప్పటికీ.. సీఎం అభ్యర్థిగా పవన్‌ను కనుక ప్రకటిస్తే.. కార్యకర్తలు బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post